మహారాష్ట్ర అటవీప్రాంతంలో అమెరికా మహిళ కేసులో బిగ్ ట్విస్ట్..!
ఈ సందర్భంగా తాను ఎందుకు ఇలా ఉన్నదనే విషయం ఆమె స్వయంగా వెళ్లడించనట్లు చెబుతున్నారు.
By: Tupaki Desk | 6 Aug 2024 4:16 AM GMTఇటీవల మహారాష్ట్ర సింధుదుర్గ్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఆకలితో అలమటిస్తూ, వర్షంలో తడిసి నీరసించిన స్థితిలో ఓ మహిళ కనిపించడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో... ఆమెను ఇక్కడ ఎవరు బంధించారు.. ఎందుకు బంధించారు వంటి ప్రశ్నలు హల్ చల్ చేశాయి. ఈ నేపథ్యంలో ఆ కేసు ఊహించని మలుపు తిరిగింది. ఈ సందర్భంగా తాను ఎందుకు ఇలా ఉన్నదనే విషయం ఆమె స్వయంగా వెళ్లడించనట్లు చెబుతున్నారు.
అవును... మహారాష్ట్ర అటవీ ప్రాంతంలో అమెరికా మహిళ కేసు ఊహించని మలుపు తిరిగింది. ఈ సందర్భంగా తన పరిస్థితికి కారణాన్ని ఆమె వెల్లడించింది. ఇందులో భాగంగా... ఇలా తాను చెట్టుకు ఇనుపగొలుసులతో బంధించడంలో ఇతరుల ప్రమేయం ఏమీ లేదని ఆమె వెల్లడించింది. తాను మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు ఆమె వెల్లడించింది.
ప్రస్తుతం రత్నగిరిలోని ఓ మానసిక వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఆమె.. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఈ విషయాలు వెల్లడించింది. తనకు భర్త కూడా లేడని తెలిపింది. ఈ సందర్భంగా స్పందించిన సింధూదుర్గ్ పోలీసులు... అమె మూడు తళాలు, ఇనుప గొలుసులను తెచ్చుకుందని.. అందులో ఒకటి తాళంతో తనకు తానే చెట్టుకు కట్టేసుకుందని తెలిపారు.
అయితే ఇలా తనను తాను బంధించుకుని ఎన్ని రోజులు అయ్యిందనేది విషయంపై స్పష్టత లేదని తెలిపారు. ఇక ఆమె తల్లి ప్రస్తుతం అమెరికాలోనే ఉన్నట్లు తెలిసిందని చెప్పిన పోలీసులు.. ఆమె వాంగ్మూలాన్ని రికార్డ్ చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకూ ఆమె కుటుంబ సభ్యులు ఎవరూ తమను సంప్రదించలేదని స్పష్టం చేశారు.
కాగా.. మహారాష్ట్రలోని సింధూదుర్గ్ అటవీ ప్రాంతంలో లలితా కయీ కుమార్ (50) అమె అమెరికా మహిళ అటవీ ప్రాంతంలో చెట్టుకు గొలుసుతో బంధించి ఉండటం తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే. వర్షంలో తడిసి ముద్దై, ఆకలితో అలమటిస్తూ ఆమె చేసిన ఆర్తనాదాలు విని ఓ గొర్రెల కాపరి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.