Begin typing your search above and press return to search.

త్వరలో కాళేశ్వరం నే ఉత్తమ్ టార్గెట్ !

రూ. 1.50 వేల కోట్లు బూడిదలో పోసిన పన్నీరయ్యాయని తెలుస్తోంది. ఈనేపథ్యంలో మేడిగడ్డ ప్రాజెక్టును సందర్భించాలని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొనడం గమనార్హం.

By:  Tupaki Desk   |   11 Dec 2023 12:30 PM GMT
త్వరలో కాళేశ్వరం నే ఉత్తమ్ టార్గెట్ !
X

కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనదని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు చెప్పేవారు. కానీ మేడిగడ్డలో పిల్లర్ కుంగడంతో దాని ప్రతిష్ట మసకబారింది. రూ. 1.50 వేల కోట్లు బూడిదలో పోసిన పన్నీరయ్యాయని తెలుస్తోంది. ఈనేపథ్యంలో మేడిగడ్డ ప్రాజెక్టును సందర్భించాలని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొనడం గమనార్హం.

కాళేశ్వరంలో జరిగిన అవినీతిపై ప్రశ్నిస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కాంగ్రెస్ నేతలు పలుమార్లు చెప్పడం తెలిసిందే. దీంతో మంత్రి పర్యటనతో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో తెలియడం లేదు. మేడిగడ్డ ప్రాజెక్టులో చోటుచేసుకున్న చర్యల వల్ల ఉత్తమ్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో కాంగ్రెస్ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపణలు చేసిన విషయం విధితమే.

మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు వెళ్లినప్పుడు ఏజెన్సీ అధికారులు తనతోనే ఉండాలని ఉత్తమ్ చెబుతున్నారు. రూ. లక్షల కోట్లు దుర్వినియోగం అయ్యాయనే వాదన వారి నుంచి వస్తున్నదే. ఇన్నాళ్లు మేడిగడ్డ ప్రాజెక్టు గురించి గొప్పలు చెప్పుకున్న బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఏం సమాధానాలు చెబుతారనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు వారి మాటలు కోటలు దాటాయి.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలో గోల్ మాల్ జరిగినట్లు పలుమార్లు చెప్పిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ప్రాజెక్టు సందర్శించి అందులోని లోపాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ నేతల అవినీతి బయటపెడతారా? ప్రాజెక్టును నామమాత్రంగానే సందర్శిస్తారా? అనేది తేలాల్సి ఉంది. మొత్తానికి ఉత్తమ్ నిర్ణయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

అధికారంలోకి రాగానే ప్రాజెక్టు సందర్శిస్తానని చెప్పడంతో బీఆర్ఎస్ నేతల్లో కంగారు మొదలైంది. తమ పాపం ఎక్కడ బయట పడుతుందోననే బెంగ పట్టుకున్నట్లు సమాచారం. ఏం జరుగుతుందోననే ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఈనేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్ణయం రాజకీయ వర్గాల్లో కూడా పలు వాదనలకు అవకాశం ఇస్తోంది.