Begin typing your search above and press return to search.

సాయిరెడ్డి కి నో ఇంట్రెస్ట్...బొత్స కీ రోల్ ?

ఇదిలా ఉంటే గత ఏడాది అక్టోబర్ లో రాజ్యసభ సభ్యుడు సీనియర్ నాయకుడు అయిన విజయసాయిరెడ్డికి ఉత్తరాంధ్రా వైసీపీ ఇంచార్జి బాధ్యతలు అప్పగించారు.

By:  Tupaki Desk   |   24 Jan 2025 2:30 AM GMT
సాయిరెడ్డి కి నో ఇంట్రెస్ట్...బొత్స కీ రోల్ ?
X

ఏ రాజకీయ పార్టీకి అయినా ఉత్తరాంధ్ర జిల్లాలు అత్యంత కీలకంగా మారుతాయి. ఈ జిల్లాలలో పార్టీ గెలిస్తే అధికారం చేతిలో పడినట్లే. అది ఉమ్మడి ఏపీ నుంచి కూడా ఆనవాయితీగా వస్తున్న విషయం. ఉత్తరాంధ్రాలో 34 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి.

విభజన ఏపీలో ఇవి మరీ కీలకంగా మారుతున్నాయి. ఎందుకంటే ఏపీలో అధికారం దక్కించుకోవాలీ అంటే ఈ ఈ సీట్లు చాలా కీలకంగా మారుతున్నాయి. ఉత్తరాంధ్రాలో చూస్తే మొదటి నుంచి టీడీపీ హవా ఎక్కువగా ఉంటుంది. వైసీపీ మాత్రం 2019 ఎన్నికల్లో భారీ విజయాన్ని నమోదు చేసింది. అయితే 2024 ఎన్నికల్లో చతికిలపడింది.

ఇదిలా ఉంటే గత ఏడాది అక్టోబర్ లో రాజ్యసభ సభ్యుడు సీనియర్ నాయకుడు అయిన విజయసాయిరెడ్డికి ఉత్తరాంధ్రా వైసీపీ ఇంచార్జి బాధ్యతలు అప్పగించారు. ఆయన రెండు సార్లు మాత్రమే విశాఖకు వచ్చారు. ఆ తరువాత ఆయన రావడం తగ్గించేశారు. ఇంకా చెప్పాలీ అంటే ఆయన బాధ్యతలు స్వీకరించలేదు అని అంటున్నారు.

ఎందుకో విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రా రీజనల్ కో ఆర్డినేటర్ గా అనాసక్తిని చూపిస్తున్నారు అని అంటున్నారు. గతంలో ఆయన 2016 నుంచి 2022 దాకా పార్టీ బాధ్యతలు స్వీకరించారు 2019 ఎన్నికల్లో వైసీపీ ఏకంగా 34 అసెంబ్లీ సీట్లకు గానూ 28 సీట్లు సాధిచి బంపర్ విక్టరీ కొట్టింది. అయితే ఆ టైం లో సాయిరెడ్డి మీద విమర్శలు విపక్షాలు పెద్ద ఎత్తున చేయడంతో ఆయనను తప్పించి వైవీ సుబ్బారెడ్డికి ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్ బాధ్యతలను జగన్ అప్పగించారు.

అయితే ఆయన రెండేళ్ళ పాటు పనిచేసినా వైసీపీకి భారీ ఓటమే దక్కింది. విశాఖ ఏజెన్సీలో రెండు అసెంబ్లీ సీటు ఒక ఎంపీ సీటు తప్ప మొత్తానికి మొత్తం ఉత్తరాంధ్ర కూటమి విజయభేరీ మోగించింది. దాంతో వైవీ సుబ్బారెడ్డిని తప్పించి మళ్ళీ విజయసాయిరెడ్డిని నియమించారు. కానీ గతంలోలా ఉత్తరాంధ్రాలో రాజకీయ పరిణామాలు లేవని ఆయన భావిస్తున్నారు అని అంటున్నారు.

అంతే కాదు వైసీపీ పార్టీ నాయకులు కూడా గతంలో మాదిరిగా రెస్పాండ్ కాకపోవడం వంటి కారణాలతో ఆయన ఎందుకొచ్చిన బాధ్యతలు అని సీరియస్ గా ఆలోచిస్తున్నట్లుగా ఉంది అని అంటున్నారు. దానితో పాటు వరసబెట్టి వైసీపీ ఉత్తరాంధ్రా జిల్లాలలో చేస్తున్న మార్పు చేర్పులు ఇంచార్జిల నియామకాలు అన్నీ కూడా చూసిన తరువాత తాను తప్పుకోవడం మంచిది అని ఆయన ఒక నిర్ణయానికి వచ్చారని అంటున్నారు.

ఇక బొత్స హవా అయితే బాగా పెరిగింది అని అంటున్నారు. ఆయన కనుసన్నలలోనే ఇటీవల ఉమ్మడి విశాఖ జిల్లా నియామకాలు జరిగాయని అంటున్నారు. బొత్సకు విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో మంచి రాజకీయ పరిచయాలు పట్టు ఉంది. బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయనకే ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగిస్తే పార్టీ మళ్ళీ ఎత్తిగిల్లుతుందని అధినాయకత్వం భావిస్తోంది అని అంటున్నారు ఇప్పటికే బొత్స ఉత్తరాంధ్రాలో తన పలుకుబడిని చూపిస్తున్నారు. రానున్న రోజులలో ఆయనకే రీజనల్ కో ఆర్దినేటర్ గా బాధ్యతలు అప్పగించవచ్చు అన్న చర్చ అయితే సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.