Begin typing your search above and press return to search.

బద్రీనాథ్ లో పెను ప్రమాదం... మంచుచరియల కింద 47 మంది!

ఉత్తరాఖండ్ లో పెను ప్రమాదం చోటుచేసుకుంది. ఇందులో భాగంగా... గత కొన్ని రోజులుగా ఇక్కడ భారీగా మంచు కురుస్తుండటంతో శుక్రవారం ఉదయం మంచు చరియలు విరిగిపడ్డాయి.

By:  Tupaki Desk   |   28 Feb 2025 2:43 PM IST
బద్రీనాథ్  లో పెను ప్రమాదం... మంచుచరియల కింద 47 మంది!
X

ఉత్తరాఖండ్ లో పెను ప్రమాదం చోటుచేసుకుంది. ఇందులో భాగంగా... గత కొన్ని రోజులుగా ఇక్కడ భారీగా మంచు కురుస్తుండటంతో శుక్రవారం ఉదయం మంచు చరియలు విరిగిపడ్డాయి. బద్రీనాథ్ ధామ్ లోని నేషనల్ హైవేపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సమయంలో 47 మంది ఆచూకీ ఆందోళనకరంగా మారింది!

అవును... ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్, దాని పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చమేలీ – బద్రీనాథ్ రహదారిపై మంచు చరియలు విరిగిపడ్డాయి. ఈ సమయంలో ఆ మంచు చరియల కింద సుమారు 57 మంది రోడ్డు నిర్మాణ కార్మికులు చిక్కుకున్నారని.. అయితే, అందులో 10 మందిని రక్షించారని తెలుస్తోంది.

మానా గ్రామం సమీపంలో జరిగిన ఈ ఘటనలో మిగిలిన 47 మంది కార్మికుల ఆచూకీ తెలియలేదని అంటున్నారు. వీరంతా మంచు కింద చిక్కుకున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో... బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీ.ఆర్.వో) బృందలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి!

ఇదే సమయంలో ఎస్.డీ.ఆర్.ఎఫ్, ఎన్.డీ.ఆర్.ఎఫ్. లతో పాటు ఇండో టిబెటన్ బోర్డర్ ఫోర్స్ (ఐటీబీపీ) సహాయక చర్యల్లో పాల్గొన్నారని అంటున్నారు. ఈ సందర్భంగా స్పందించిన బీ.ఆర్.వో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్.. మూడు నుంచి నాలుగు అంబులెన్స్ లను సంఘటనా స్థలానికి పంపినట్లు తెలిపారు. భారీ మంచు కారణంగా సహాయక చర్యలు ఆలస్యం అయ్యాయని అన్నారు.

మరోపక్క... ఉత్తరాఖండ్ తో సహా అనేక కొండ ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ (ఐ.ఎం.డీ) ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇందులో భాగంగా... శుక్రవారం అర్ధరాత్రి వరకూ సుమారు 20 సెం.మీ. వరకూ భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఆ 47 మంది ఆచూకీపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు.