స్నేహితుడితో కలిసి భర్తను హత్యచేసిన భార్య... కోర్టు సంచలన తీర్పు!
అవును... స్నేహితుడు సహాయంతో భర్తను హత్య చేసిన భార్యకు ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్ పూర్ లోని ఓ కోర్టు మరణ శిక్ష విధించింది.
By: Tupaki Desk | 10 Oct 2023 2:45 AM GMTభర్తను చంపిన భార్య... భార్యను చంపిన భర్త... అక్రమ సంబంధం కారణంగా దారుణం - అనాదలైన పిల్లలు... మొదలైనటువంటి వార్తలు నిత్యం ఏదో ఒక మూల దర్శనమిస్తూనే ఉంటాయి. పోలీస్ వ్యవస్థ అంటే భయం లేకో.. లేక, కోర్టుల్లో ఎలాగైనా తప్పించుకోవచ్చే నమ్మకం ఉండో తెలియదు కానీ... దొరికిపోతారని తెలిసినా కూడా తప్పుడు ఆలోచనలతో భారీ క్రైం కు పాల్పడుతున్నారు కొంతమంది భార్యా భర్తలు!
ఈ క్రమంలో తాజాగా స్నేహితుడు సహాయంతో భర్తను హత్య చేసిన భార్య వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. అంతకంటే ప్రధానంగా ఈ కేసు విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పు మరింత చర్చనీయాంశం అయ్యింది. ఈ తీర్పువల్ల చాలామంది ఆలోచనల్లో మార్పు రావాలని, దుర్మార్ఘపు ఆలోచనలు రూపుమానుకోవాలనీ కామెంట్లు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ కేసులో కోర్టు భార్యకు మరణశిక్ష విధించింది.
అవును... స్నేహితుడు సహాయంతో భర్తను హత్య చేసిన భార్యకు ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్ పూర్ లోని ఓ కోర్టు మరణ శిక్ష విధించింది. తన ఎన్నారై భర్తను ఏడేళ్ల క్రితం స్నేహితుడితో హత్య చేసిన కేసును విచారించిన న్యాయస్థానం ఆమెకు మరణశిక్ష విధించడంతో పాటు.. ఈ హత్యలో తనకు సహకరించిన ఆమె స్నేహితుడికి జీవిత ఖైదుతోపాటు 3 లక్షల రూపాయల జరిమానా విధించింది.
వివరాళ్లోకి వెళ్తే... సుఖ్ జీత్, బ్రిటిష్ పౌరురాలు అయిన అతని భార్య రమణదీప్ కౌర్, కుమారులు అర్జున్, ఆర్యన్ ఆగస్టు 2016లో షాజహాన్ పూర్ లోని స్వస్థలాన్ని సందర్శించడానికి ఇండియాకు వచ్చారని ప్రాసిక్యూషన్ తెలిపింది. ఈ సమయంలో పంజాబ్ కు చెందిన గురుప్రీత్ కూడా వారితో పాటు ఉన్నాడని పేర్కొంది.
ఈ క్రమంలో సెప్టెంబర్ 2 - 2016న సుఖ్ జీత్ తన ఇంట్లోనే హత్యకు గురయ్యాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో గతకొన్ని రోజులుగా కేసులో విచారణ జరుగుతుంది. ఈ సమయంలో సుఖ్ జీత్ సింగ్ (34) తన కుమారులు అర్జున్, ఆర్యన్ లతో కలిసి నిద్రిస్తున్న సమయంలో... అతని భార్య కౌర్, ఆమె స్నేహితుడు గురుప్రీత్ లు హత్య చేశారని ప్రభుత్వ న్యాయవాది శ్రీ పాల్ వర్మ తెలిపారు.
ఇదే క్రమంలో విచారణ సమయంలో పిల్లలిద్దరూ అసలు విషయం చెప్పారని తెలుస్తుంది. ఇందులో భాగంగా... తమ తండ్రి నిద్రపోతున్న సమయంలో తమ తల్లి దిండుతో నొక్కిపట్టిందని.. ఆపై గుర్ ప్రీత్ తలపై సుత్తితో కొట్టాడని అర్జున్ కోర్టుకు తెలిపాడు. ఆ తర్వాత గురుప్రీత్ తన జేబులోంచి కత్తి తీసి కౌర్ కి ఇచ్చాడని.. దీంతో ఆమె గొంతు కోసిందని అర్జున్ పేర్కొన్నాడు.
దీంతో ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం రమణదీప్ కౌర్ కు మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెల్లడించింది. ఈ హత్యలో ఆమెకు సహకరించిన గురుప్రీత్ కి జీవిత ఖైదుతోపాటు 3 లక్షల రూపాయల జరిమానా విధించింది.