అబ్బాయా... అమ్మాయా... భార్య కడుపు కోసిన కిరాతకుడు!
వివరాళ్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్ లోని బదౌన్ కు చెందిన పన్నాలాల్ - అనిత దంపతులకు ఐదుగురు సంతానం. అయితే వారంతా ఆడపిల్లలే కావడంతో.. తనకు కుమారుడు కావాలంటూ తన భార్యను తరచూ మానసికంగా, శారీరకంగా హింసించేవాడు.
By: Tupaki Desk | 25 May 2024 3:42 AM GMTసమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు చుస్తుంటే... మనిషిలో మానవత్వపు లక్షణాలు అత్యంత వేగంగా తగ్గుముఖం పడుతున్నాయని అనిపించక మానదు! మూర్ఖత్వానికి పరాకాష్ట, కిరాతకత్వానికి మచ్చుతునక అన్నట్లుగా జరిగిన ఓ సంఘటన చూస్తే.. ఎవరికైనా ఇదే ఆలోచన వచ్చే అవకాశం ఉంది! ఈ క్రమంలో... లింగ నిర్ధారణ కోసం భార్య కడుపు కోసి చూసిన కిరాతకుడి కథ ఇప్పుడు చూద్దాం...!
అవును... తన భార్య కడుపులో ఉన్నది ఆడ బిడ్డా, మగ బిడ్డా అనే విషయం తెలుసుకోవడం కోసం ఓ కిరాతకుడు తనకు తోచినట్లుగా ప్రయత్నించాడు. ఇందులో భాగంగా మానవత్వం మరిచాడు.. దారుణమైన పనికి ఒడిగట్టాడు.. ఏకంగా తన భార్య పొట్ట కోశాడు! దీంతో.. ఇతడికి ఉత్తరప్రదేశ్ న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఇప్పుడు ఈ విషయం తీవ్ర సంచలనంగా మారింది.
వివరాళ్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్ లోని బదౌన్ కు చెందిన పన్నాలాల్ - అనిత దంపతులకు ఐదుగురు సంతానం. అయితే వారంతా ఆడపిల్లలే కావడంతో.. తనకు కుమారుడు కావాలంటూ తన భార్యను తరచూ మానసికంగా, శారీరకంగా హింసించేవాడు. ఇదే సమయంలో... తనకు ఈసారి కొడుకుని కని ఇవ్వకపోతే విడాకులు ఇచ్చి మరొకరిని వివాహం చేసుకుంటానని బెదిరించేవాడు.
ఈ క్రమంలో తన భార్య మరోసారి గర్భవతి అయ్యింది. దీంతో... పుట్టబోయేది మగబిడ్డా కాదా అనే విషయంపై తన భార్యతో రోజూ గొడవకు దిగేవాడు. ఈ నేపథ్యంలో ఓ రోజు ఈ విషయంపై గొడవ జరగడంతో... కడుపులో ఉన్నది మగ బిడ్డేనా, కాదా అని తెలుసుకోవడానికి కొడవలితో ఆమె కడుపును చీల్చాడు.
దీంతో... విపరీతమైన ఆ నొప్పి భరించలేక కేకలు వేస్తూ ఆమె బయటకు పరిగెత్తింది. విషయం తెలుసుకున్న బాధితురాలి సోదరుడు ఆమె అరుపులు విని ఘటనా స్థలానికి చేరుకొన్నాడు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించాడు. దీంతో... దాడి జరిగిన సమయంలో బాధితురాలు ఎనిమిది నెలల గర్భిణి అని.. అయితే ఆమె ప్రాణానికి ప్రమాదం లేదని తెలిపారు!
అయితే.. ఈ చర్యవల్ల ఆమె కడుపులో ఉన్న మగబిడ్డ మాత్రం చనిపోయాడని వైద్యులు తెలిపారు. మరోపక్క పరారీలో ఉన్న నిందితుడు పన్నాలాల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2020 సెప్టెంబర్ లో ఈ సంఘటన జరగ్గా.. తాజాగా ఈ కేసులో న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఇందులో భాగంగా... నిందితుడికి జీవిత ఖైదు విధించింది.