పైశాచికత్వానికి పరాకాష్ట... బాటిళ్లలో మూత్రాన్ని నింపి..!
యూపీలోని సిద్దార్థనగర్ జిల్లా కేంద్రానికి చెందిన 10, 15 ఏళ్ల బాలురిద్దరు డబ్బు దొంగతనం చేశారని ఆరోపిస్తూ కొందరు వ్యక్తులు వారిని పట్టుకున్నారు
By: Tupaki Desk | 7 Aug 2023 4:24 AM GMTఈ మధ్యకాలంలో మానవత్వం మరుస్తున్న మనుషులు.. మృగాలను తలపితోన్న మనుషులు రోజు రోజుకీ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. వీరిని చూసి.. వీరు కూడా మనుషులేనా, వీరిది కూడా మానవపుట్టుకేనా అనాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఈ ఘటన గురించి తెలుసుకుంటే... ఎవరికైనా ఇలాంటి ఆలోచనే వస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు!
అవును... ఇటీవల మధ్యప్రదేశ్ లో ఆదివాసీ వ్యక్తిపై మూత్రం పోసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఇంతకుమించి అన్నట్లుగా మరో ఘోరం ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఈ అమానవీయ ఘటన మనిషిలో మానవ లక్షణాలు కనుమరుగైపోతున్నానే చర్చను మరోసారి తెరపైకి తెస్తోంది.
వివరాళ్లోకి వెళ్తే... యూపీలోని సిద్దార్థనగర్ జిల్లా కేంద్రానికి చెందిన 10, 15 ఏళ్ల బాలురిద్దరు డబ్బు దొంగతనం చేశారని ఆరోపిస్తూ కొందరు వ్యక్తులు వారిని పట్టుకున్నారు. అనంతరం వాళ్లను ఓ చోట బంధించి వికృత చేష్టలకు పాల్పడ్డారు. వారిని దుర్భాషలాడుతూ.. శారీరకంగా హింసించారు. వాళ్లతో బలవంతంగా పచ్చిమిరపకాయాలు తినిపించారు.
అక్కడితో వాళ్ల పైశాచికత్వం ఆగలేదు.. రెండు కాళ్లతో నడుస్తున్న మృగాలా అనే అనుమానం వచ్చేలా ప్రవర్తించారు. అందులో భాగంగా... మంటతో వాళ్లు ఏడుస్తుంటే.. తాగేందుకు బాటిళ్లలో మూత్రం నింపి ఇచ్చారు. వాళ్లు నిరాకరిస్తే.. చంపేస్తామని బెదిరించి బలవంతంగా తాగించారు.
అనంతరం ఆ బాలురిద్దరి దుస్తులు విప్పించేసి.. వాళ్ల మలద్వారంలో మిరపకాయలు కుక్కేశారు. బాధతో వాళ్లు ఏడుస్తుంటే రాక్షసానందం పొందారు. ఈ ఘటనను అక్కడికి సమీపంలో ఉన్న ఓ చికెన్ దుకాణంలో ఉన్న వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
అలా వెలుగులోకి వచ్చిన వీడియో మరింత వైరల్ గా మారడంతో ఈ వీడియో పోలీసుల దృష్టికి వచ్చింది. అనంతరం దర్యాప్తు చేసిన పోలీసులు.. దాడికి పాల్పడిన వ్యక్తులను గుర్తించామని, వారిలో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు