Begin typing your search above and press return to search.

అక్కడ 'జై శ్రీరాం'అని రాస్తే పరీక్ష పాస్

ఉత్తరప్రదేశ్‌లోని వీర్‌బహదూర్ సింగ్ పూర్వాంచల్ యూనివర్సిటీలో జరిగిన ఈ తతంగం సమాచారం హక్కు చట్టం కింద ధరఖాస్తు చేసుకుని కొన్ని సమాధాన పత్రాలను పరిశీలించగా వెలుగులోకి వచ్చింది.

By:  Tupaki Desk   |   27 April 2024 10:10 AM GMT
అక్కడ జై శ్రీరాంఅని రాస్తే పరీక్ష పాస్
X

యూనివర్శిటీ పరీక్షలలో "జై శ్రీరాం. విరాట్ కొహ్లీ, హార్ధిక్ పాండ్యా, రోహిత్ శర్మ" అని వారికి తోచింది రాసేశారు. అయినా వారు 60 శాతం పైగా మార్కులతో పరీక్షలలో ఉత్తీర్ణత సాధించారు. ఉత్తరప్రదేశ్‌లోని వీర్‌బహదూర్ సింగ్ పూర్వాంచల్ యూనివర్సిటీలో జరిగిన ఈ తతంగం సమాచారం హక్కు చట్టం కింద ధరఖాస్తు చేసుకుని కొన్ని సమాధాన పత్రాలను పరిశీలించగా వెలుగులోకి వచ్చింది. దీనికి బాధ్యులుగా గుర్తించి విశ్వవిద్యాలయానికి చెందిన ఇద్దరు ప్రొఫెసర్లను కూడా సస్పెండ్ చేశారు.

కొందరు ప్రొఫెసర్లు డబ్బులు తీసుకుని విద్యార్థులు ఏది పడితే అది రాసినా పరీక్షలలో పాస్ చేశారని అక్కడి విద్యార్థి సంఘం నాయకుడు దివ్యాన్షూ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ల నిర్వాకం మీద ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు విశ్వవిద్యాలయ ఉప కులపతికి కూడా లేఖ రాశాడు. సున్నా మార్కులు రావాల్సిన విద్యార్థులను కూడా ఫస్ట్ క్లాస్ లో పాస్ చేశారని లేఖలో పేర్కొన్నాడు.

"విశ్వవిద్యాలయంలో జరిగిన ఈ తతంగంపై ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామని, విద్యార్థులకు అదనపు మార్కులు ఇచ్చిన విషయం కమిటీ తన రిపోర్టులో పేర్కొందని, అసంబధ్ద సమాధానాలకు మార్కులు కేటాయించినట్లు ఉన్న సమాధాన పత్రాన్ని తాను చూశానని, అందులోని చేతిరాత కూడా అర్ధం కాని విధంగా ఉందని" విశ్వవిద్యాలయ ఉప కులపతి వందన సింగ్ తెలిపారు. ఈ వ్యవహారం ఎక్కడికి దారితీస్తుందో ? ఎన్ని ఏళ్లుగా ఈ వ్యవహారం సాగుతుందో ? లెక్కతేలాల్సి ఉంది.