Begin typing your search above and press return to search.

పిఠాపురంలో మామ గెల‌వాలంటూ చిన్న‌ మేన‌ల్లుడు!

ఇంకా కొంత‌మంది సీరియ‌ళ్లు ఆర్టిస్టులు కూడా పీకే కోసం స్వ‌చ్ఛందంగా వ‌చ్చి ప్ర‌చారం చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   3 May 2024 10:31 AM GMT
పిఠాపురంలో మామ గెల‌వాలంటూ చిన్న‌ మేన‌ల్లుడు!
X

పిఠాపురం ఇప్పుడు ఏపీ ఎన్నిక‌ల్లో హాట్ టాపిక్ గా మారిన నియోజ‌క‌వ‌ర్గం. కాపు సామాజిక వ‌ర్గం నుంచి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్-వైకాపా నుంచి వంగా గీత బ‌రిలో ఉండ‌టంతో గెలుపు పై ఎవ‌రికి వారు ధీమాగా ఉన్నారు. ఇరువురి మ‌ధ్య ట‌ప్ ఫైట్ త‌ప్ప‌ద‌ని స‌ర్వేలు చెబుతున్నాయి. ఎన్నిక‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డ‌టంతో?ఆ నియోజ‌క వ‌ర్గంలో ప్ర‌చారం ఠారెత్తిపోతుంది. ఇక ప‌వ‌న్ కోస‌మైతే జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్లు అంతా ప‌ది రోజుల క్రిత‌మే రంగంలోకి దిగేసి ఆ ని యోజక వ‌ర్గంలో ప్ర‌చారం చేస్తున్నారు.

ఇంకా కొంత‌మంది సీరియ‌ళ్లు ఆర్టిస్టులు కూడా పీకే కోసం స్వ‌చ్ఛందంగా వ‌చ్చి ప్ర‌చారం చేస్తున్నారు. వీళ్లంద‌రి త‌ర్వాత మెగా ఫ్యామిలీ కూడా రంగంలోకి దిగిన సంగ‌తి తెలిసిందే. వ‌రుణ్ తేజ్...త‌న త‌ల్లి కూడా పిఠాపురంలో ప్ర‌చారం చేసారు. నాగ‌బాబు భార్య ప‌ద్మ‌జ ఇంటింటా తిరిగి ప్ర‌చారం చేయ‌గా వ‌రుణ్ తేజ్ పార్టీ శ్రేణుల‌తో క‌లిసి రోడ్ షో నిర్వ‌హించారు. ఇక నిన్న‌టి రోజున మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ కూడా రంగంలోకి దిగాడు.

పాదగయ క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వ‌హించి మేనమామకు విజయం చూకూరేలా ఆశీస్సులు అందజేయా లంటూ ప్రార్థించారు. అనంత‌రం పార్టీ శ్రేణుల‌తో క‌లిసి రోడ్ షోలో పాల్గొన్నారు. అభిమా నులు..కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అడుగ‌డుగునా వైష్ణ‌వ్ తేజ్ కి ఘ‌నంగా పూల వ‌ర్షం కురిసింది. ఆయ‌న‌తో పాటు గెట‌ప్ శ్రీను..సుడిగాలి సుధీర్ కూడా ప‌క్క‌నే ఉండి రోడ్ షోని గ్రాండ్ స‌క్సెస్ చేసారు.

ఈ రోడ్ షో కొండెవరం నుంచి ఉప్పాడ వరకు సాగింది. ఇంకా ఎన్నిక‌లకు ప‌దిరోజులే స‌మ‌యం ఉండ‌టంతో మెగా ఫ్యామిలీ నుంచి మిగ‌తా హీరోలు కూడా పిఠాపురం వ‌స్తార‌ని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం సాగుతోంది. మెగాస్టార్ చిరంజీవి కూడా త‌మ్ముడు గెలుపు కోసం నియోజ‌క వ‌ర్గానికి వ‌స్తార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగుతుంది. ఇప్ప‌టికే చిరంజీవి కూట‌మి బ‌ల‌ప‌ర్చిన అభ్య‌ర్దుల కోసం ప్ర‌చారం చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. రామ్ చ‌ర‌ణ్‌..సాయిదుర్గ తేజ్ కూడా వ‌చ్చే అవ‌కాశాలున్నాయంటున్నారు. అయితే వీరంతా ప‌వ‌న్ పిలిస్తే వ‌స్తున్నారా? లేక స్వ‌చ్ఛందంగా వ‌చ్చి ప్ర‌చారం చేస్తున్నారా? అన్న‌ది క్లారిటీ లేదు.