Begin typing your search above and press return to search.

ఎన్నాళ్ళకెన్నాళ్ళకు : వంశీ కొడాలి నాని పిక్స్ వైరల్

వైసీపీ ఘోర పరాజయం తరువాత అతి పెద్ద సంక్షోభం దిశగా పార్టీ సాగుతోంది. పార్టీకి వీర విధేయులు పునాదుల నుంచి ఉన్న వారు కూడా పార్టీకి గుడ్ బై చెబుతున్నారు

By:  Tupaki Desk   |   25 Sep 2024 5:28 PM GMT
ఎన్నాళ్ళకెన్నాళ్ళకు : వంశీ కొడాలి నాని  పిక్స్ వైరల్
X

వైసీపీ ఘోర పరాజయం తరువాత అతి పెద్ద సంక్షోభం దిశగా పార్టీ సాగుతోంది. పార్టీకి వీర విధేయులు పునాదుల నుంచి ఉన్న వారు కూడా పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. వైసీపీలో పదవులు ఉన్న వారు కూడా వద్దు అనుకుని రాజీనామాలు చేస్తున్నారు. ఆ విధంగా చూస్తే ముగ్గురు రాజ్యసభ సభ్యులు అతి తక్కువ టైం లోనే పార్టీకి దూరం అయ్యారు.

ఇదేమి చిత్రమో అర్ధం కావడం లేదని వైసీపీలో చర్చ కూడా సాగుతోంది. పదవులు లేని వారు రాజీనామాలు చేస్తారు కానీ పదవులలో ఉన్న వారు గుడ్ బై అంటే ఆలోచించాల్సిందే అని అంటున్నారు. అలాగే ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. ఇప్పటికే ముగ్గురు రాజీనామా చేశారు. ఆ లిస్ట్ కూడా పెరిగేలా ఉంది అని అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే వీర విధేయులు అనుకున్న మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ కూడా వైసీపీని వీడారు. అంతదాకా ఎందుకు వైసీపీ అధినేతకు దగ్గర బంధువుగా ఉన్న బాలినేని శ్రీనివాస్ కూడా గుడ్ బై కొట్టారు. ఈ నేపథ్యంలో పార్టీకి అతి పెద్ద ఆయుధంగా ఉంటూ ఫైర్ బ్రాండ్ గా ఉన్న కీలక నేతలు కూడా గత నాలుగు నెలలుగా కనిపించకుండా పోయారు.

మరీ ముఖ్యంగా క్రిష్ణా జిల్లాలో చూస్తే కనుక కొడాలి నాని వల్లభనేని వంశీ కూడా పార్టీలో ఉన్నారా లేరా అన్న చర్చ నడచింది. కొడాలి నాని మీద అయితే అరెస్ట్ కత్తి వేలాడుతోంది అని ప్రచారమూ ఉంది. వంశీ విషయంలోనూ అలాగే చేస్తారు అని టాక్ ఉంది. ఈ క్రమంలో ఈ ఇద్దరూ అజ్ఞాత వాసంలో ఉన్నారు అని కూడా ప్రచారం సాగింది.

అయితే సడెన్ గా అందరికీ ఆశ్చర్యానికి గురి చేస్తే వల్లభనేని వంశీ, కొడాలి నాని తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో ప్రెస్ మీట్ లో కనిపించారు. ఆ ఇద్దరూ కూడా పేర్ని నానితో కలసి ప్రెస్ మీట్ కి అటెండ్ అయ్యారు. కొడాలి నాని అయితే గతంలో మాదిరిగానే చంద్రబాబు మీద మాటలతో నిప్పులు కురిపించేశారు.

మక్కెలిరగ తంతాను అంటున్న బాబు ముందు తన పార్టీలో వారి మీద కూటమి ఎమ్మెల్యేల మీద క్రమశిక్షణ తప్పిన వారి మీద మక్కెలు విరగ తన్ని ఆ మీదట ఇతర పార్టీల జోలికి వస్తే బాగుంటుంది అని అన్నారు. ఏపీలో లా అండ్ అర్డర్ లేదని విమర్శించారు.

అంతే కాదు తిరుమల శ్రీవారి తో బాబు పెట్టుకున్నారు అని హాట్ కామెంట్స్ చేశారు మహిమాన్వితుడైన స్వామి లడ్డూ ప్రసాదం మీద నీచ రాజకీయం చేస్తున్నారు అని బిగ్గరగానే మాట్లాడారు. ఈ విధంగా చూస్తే కనుక చంద్రబాబు మీద నాని గతంలో ఉన్న మాదిరిగానే చెలరేగారని అంటున్నారు.

దీంతో ఇపుడు ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇద్దరూ చాలా కాలంగా కనిపించడం లేదు. ఇపుడు సడెన్ గా వారు ఎంట్రీ ఇచ్చేసరికి వైసీపీ శ్రేణులు వారి ఫోటోలను షేర్ చేస్తున్నాయి. దాంతో నెటిజన్లు కూడా తలో విధంగా స్పందిస్తున్నారు.

వైసీపీ ఇపుడు ఒకింత ఇబ్బందులో ఉంది దాంతో కొడాలి నానిని రప్పించారా లేక ఆయనే అజ్ఞాత వాసం వీడారా అన్న చర్చ సాగుతోంది. అలాగే రాజకీయలకు ఫుల్ స్టాప్ పెడతారు అనుకున్న వల్లభనేని వంశీ కూడా మీడియాలో మెరవడంతో క్రిష్ణా జిల్లాలో వైసీపీకి మళ్లీ పాత గొంతుకలే కొత్తగా వినిపిస్తాయా అన్న చర్చ సాగుతోంది. ఏది ఏమైనా కష్టాల తీరంలో ఉన్న వైసీపీకి ఈ సీనియర్ల రాక మాత్రం కొంత హుషార్ తెచ్చిందని వైసీపీ శ్రేణులు అంటున్నాయి.