బ్రేకింగ్... వల్లభనేని వంశీకి మరో షాక్!
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుందనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోందని అంటున్నారు.
By: Tupaki Desk | 27 March 2025 12:18 PMగన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుందనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోందని అంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆయన చేసిన పనులు, మాట్లాడిన మాటలకు ప్రతిఫ్రలం దక్కుతుందనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ సమయంలో తాజాగా మరో బిగ్ షాక్ తగిలింది.
అవును... గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బిగ్ షాక్ తగిలింది. ఇందులో భాగంగా.. తనకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఆ బెయిల్ పిటిషన్ ను ధర్మాసనం డిస్మిస్ చేసింది.
వాస్తవానికి గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై దాడి కేసులో వల్లభనేని వంశీ ఏ71గా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తెరలించారు. ఇదే సమయంలో... ఈ కేసుతో పాటూ మరిన్ని కేసులు కూడా ఆయనపై నమోదైన పరిస్థితి. దీంతో.. ఆయన ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో.. ఆయన బెయిల్ ఇవ్వాలని కోరారు. ఈ మేరకు విజయవాడ కోర్టును ఆశ్రయించారు. అయితే.. కోర్టులో ఆయనకు ఊరట లభించలేదు. వంశీ దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు డిస్మిస్ చేసింది. దీంతో... వల్లభనేని వంశీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలిందనే చర్చ మొదలైంది.
కాగా.. గన్నవరం టీడీపీ ఆఫీసుపై ఫిబ్రవరి 20 - 2023న జరిగిన దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముఖ్య అనుచరుడు ఓలుపల్లి మోహనరంగాకూ విజయవాడ కోర్టు ఏప్రిల్ 9 వరకూ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులు బెయిల్ కోసం ఆశ్రయించగా కోర్టు తిరస్కరించింది.
దీంతో... ఈ కేసులో ఏ1గా ఉన్న రంగా తొలుత అజ్ఞాతంలోకి వెళ్లారు. టీడీపీ ఆఫీసుపై దాడి ఘటనలో రంగా పాత్రపై ఫోటోలు, వీడియో ఆధారాలు ఉన్నట్లు చెబుతారు. మరోపక్క సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులోనూ రంగా ఏ5గా ఉన్నారు.