వంశీతో యార్లగడ్డ..కసికసిగా గన్నవరం పోరు!
వల్లభనేని వంశీ డైనమిక్ పొలిటికల్ లీడర్. ఆయన 2009లో డైరెక్ట్ గా రాజకీయ రంగ ప్రవేశం చేశారు.
By: Tupaki Desk | 20 Aug 2023 12:34 PM GMTవల్లభనేని వంశీ డైనమిక్ పొలిటికల్ లీడర్. ఆయన 2009లో డైరెక్ట్ గా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తొలిసారి వస్తూనే ఆయన విజయవాడ లాంటి ప్రతిష్టాత్మకమైన ఎంపీ సీటు నుంచి టీడీపీ తరఫున పోటీ చేశారు. అవతల వైపు కాంగ్రెస్ పార్టీ నుంచి లగడపాటి రాజగోపాల్ ఉన్నారు. ఇలా ఢీ అంటే ఢీ మాదిరిగా సాగిన పోరులో వంశీ నాలుగు లక్షల 16 వేల 682 ఓట్లను సాధించారు. 2004లో లగడపాటికి లక్షా 14 వేల ఓట్ల మెజారిటీ వస్తే దాన్ని 12 వేలకు కుదించగలిగారు. అలా ఓడి గెలిచారు వంశీ.
వంశీకి ఉన్న బలం అలాంటిది అని అంటారు. ఇక 2014లో 2019లలో వంశీ గన్నవరం సీటు నుంచి పోటీ చేసి గెలిచారు. ఆయన జగన్ వేవ్ ని సైతం తట్టుకుని గెలవడం విశేషం. 2019లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిన యార్లగడ్డ ఈసారి టీడీపీ నుంచి వంశీ మీద తలపడబోతున్నారు. ఆ ఎన్నికల్లో టీడీపీ మీద పోటీ చేసిన వంశీ ఇపుడు వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు.
ఈ నెల 21న గన్నవరంలో జరిగే మీటింగులో నారా లోకేష్ సమక్షంలో యార్లగడ్డ వెంకటరావు టీడీపీలో చేరుతారని, నారా లోకేష్ ఆయన్ని గన్నవరం క్యాండిడేట్ గా సభా ముఖంగా ప్రకటిస్తారు అని అంటున్నారు. ఇక యార్లగడ్డ 2019లో గెలవాల్సిందే జస్ట్ 838 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి ఆయన కసి మీద ఉన్నారు. వంశీని ఓడించి తీరుతాను అని పంతం పడుతున్నారు.
ఇక టీడీపీకి కూడా వంశీ మీద కసి ఉంది. ఇలా రెండు విధాలుగా కలసిన కసి వంశీని ఓడిస్తుందా లేదా అన్నది చూడాలి. అయితే వంశీకి బలం గన్నవరంలో చాలానే ఉంది. ఆయన ఏదో విధంగా గెలుపును ముద్దాడుతారు అని అంటారు. వంశీ బలమైన నేత మాత్రమే కాదు దూసుకుపోయే నేత.
ఆయన వైసీపీ నుంచి దిగుతున్నారు అన్ని విధాలుగా అధికార పక్షం అండగా ఉంటుంది. ఈ సీటు కచ్చితంగా గెలుచుకోవాలని గత రెండు ఎన్నికల నుంచి వైసీపీ కసి మీద ఉంది. ఇక వంశీకి కూడా తన బలం ఏంటో చాటి చెప్పాలని టీడీపీ అధినాయకత్వానికి తానేటో మరోసారి చూపించాలని కసి ఉంది. ఇలా ఈ వైపు కూడా రెండు విధాలుగా కసి ఉన్నాయి.
దాంతో కసిగా రెండు వైపుల నుంచి వంశీ యార్లగడ్డ మోహరించనున్నారనీ అంటున్నారు. మరి ఎవరి కసి గెలుస్తుంది, ఎవరి పట్టుదల నిలుస్తుంది అన్నదే గన్నవరంలో 2024 ఎన్నికల్లో అంతా చూడాల్సిన విషయం. 2024లో ఏపీలో అనేక హాట్ సీట్స్ ఉన్నాయి. వాటిలో ఇపుడు గన్నవరం కూడా చేరింది. ప్రత్యర్ధులు పార్టీలు మార్చుకుని గెలిచి తీరాలన్న పట్టుదలతో వస్తున్న గన్నవరం వైసీపీ టీడీపీల మధ్య రాజకీయ కురుక్షేత్ర పోరాటానికి వేదిక అవుతుంది అని అంటున్నారు. సో వెయిట్ అండ్ సీ.