హోటల్లో ఐటీ ఉద్యోగిని రే*ప్ చేసిన రెండోవోడు దొరికేశాడు
రెండు రోజుల క్రితం వెలుగు చూసిన రే*ప్ ఉదంతం పెను సంచలనంగా మారిన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 1 Aug 2024 6:13 AM GMTరెండు రోజుల క్రితం వెలుగు చూసిన రే*ప్ ఉదంతం పెను సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఐటీ కంపెనీలో జాబ్ వచ్చిందన్న సంతోషకరమైన వార్తను చిన్ననాటి స్నేహితుడితో షేర్ చేసుకుంటే.. పార్టీ ఇవ్వాలని పట్టుబట్టి.. హోటల్ కు తీసుకెళ్లి మత్తులో దించేసి అత్యాచారం చేయటం.. తన స్నేహితుడితో రే*ప్ చేయించిన వైనం షాకింగ్ గా మారటం తెలిసిందే. వనస్థలిపురంలో చోటుచేసుకున్న ఈ ఉదంతంలో చిన్ననాటి స్నేహితుడ్ని పోలీసులు అప్పుడే అరెస్టు చేయగా.. రెండో నిందితుడ్నిసైతం తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రెండో నిందితుడు నల్గొండ జిల్లాకు చెందినోడని.. రాష్ట్ర మంత్రి ఒకరికి అనుచరుడిగా వార్తలు వచ్చాయి. ఈ కారణంతోనే అతడ్ని అదుపులోకి తీసుకోవటంలో పోలీసులు ఫెయిల్ అవుతున్నట్లుగా తప్పుడు ప్రచారం సాగింది. తప్పు చేసినోడు ఎవడైనా.. ఎంతటివాడైనా వదిలేది లేదంటూ చెప్పిన పోలీసులకు తగ్గట్లే.. తాజాగా చర్యలు అలానే ఉండటం గమనార్హం. మాటలకు తగ్గట్లే చేతలు ఉన్నాయి. వనస్థలిపురం వద్దనున్న బార్ అండ్ రెస్టారెంట్ లో పార్టీకి తీసుకెళ్లి.. మద్యం తాగించి.. మత్తులోకి జారిన తర్వాత.. సదరు యువతి మీద చిన్ననాటి స్నేహితుడు.. అతడి ఫ్రెండ్ అత్యాచారం చేశారు. తీవ్రమైన రక్తస్రావం జరగటం.. పెద్దగా అరుపులు వేయటంతో హోటల్ సిబ్బంది ఆమెను రక్షించే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో నిందితులు ఇద్దరూ పారిపోయారు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. దారుణం జరిగిన గంటల్లోనే బాధిత యువతి చిన్ననాటి స్నేహితుడ్ని అదుపులోకి తీసుకోగా.. రెండు రోజుల వ్యవధిలోనే రెండో నిందితుడ్ని అరెస్టు చేశారు. అయితే.. అతడి అరెస్టుకు ముందు.. అతడ్ని కావాలనే పోలీసులు తప్పిస్తున్నట్లుగా ప్రచారం సాగింది. అయితే.. మొదట్నించి ఈ కేసులో ఒకేలాంటి కమిట్ మెంట్ ప్రదర్శిస్తున్న పోలీసులు.. నిందితుడి స్థాయి ఎలాంటిదైనా తమకు అనవసరమని.. అతడ్ని పట్టుకోవటం ఖాయమని స్పష్టం చేసిన పోలీసులు అందుకు తగ్గట్లే.. బుధవారం రాత్రి వేళలో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా హైదరాబాద్ పోలీసులు అన్న మాట మీదనే నిలబడ్డారని చెప్పాలి.