వందేభారత్ ట్రైన్ స్టాప్ పై పిటిషన్... సుప్రీం రియాక్షన్ వైరల్?
కేరళల లోని తిరూర్ రైల్వే స్టేషన్ లో వందే భారత్ ట్రైన్ స్టాప్ కోసం తొలుత సౌత్ రైల్వేకు రిక్వెస్ట్ పెట్టారట స్థానికులు
By: Tupaki Desk | 18 July 2023 5:56 AM GMTదేశ అత్యున్నత న్యాయస్థానాని కి కోపం తెప్పించే పని ని ఒక న్యాయవాది చేశారని తెలుస్తుంది. దీంతో సుప్రీంకోర్టు ఆ న్యాయవాది పై ఫైరైందంట. ఓ న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ పై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేయడం హాట్ టాపిక్ గా మారిందని అంటున్నారు!
అవును... రైళ్లు ఎక్కడ ఆగా లో కూడా మేం చెప్పాలా? అత్యున్నత న్యాయస్థానం అంటే అలా కనిపిస్తోందా? అంటూ పిటిషనర్ ను సుప్రీంకోర్టు నిలదీసిందని తెలుస్తుంది. వందే భారత్ రైలు కు తన సొంత జిల్లాలో స్టాప్ కేటాయించేలా రైల్వే శాఖ ను ఆదేశించాలంటూ ఓ న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసిందని అంటున్నారు.
వివరాళ్లోకి వెళ్తే... కేరళల లోని తిరూర్ రైల్వే స్టేషన్ లో వందే భారత్ ట్రైన్ స్టాప్ కోసం తొలుత సౌత్ రైల్వేకు రిక్వెస్ట్ పెట్టారట స్థానికులు! అయితే సౌత్ రైల్వేస్ నుంచి స్పందన రాకపోవడంతో.. కేరళ హైకోర్టు ను ఆశ్రయించారట. తిరూర్ రైల్వే స్టేషన్ లో వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ను ఆపేలా ఆదేశించాలంటూ విజ్ఞప్తి చేశారట. అయితే, ఈ పిటిషన్ ను కేరళ హైకోర్టు కొట్టేసిందందట.
దీంతో... వందే భారత్ ట్రైన్ ను కేరళల లోని తిరూరు స్టాపింగ్ లో ఆపాల ని, రాజకీయ కారణాలతో తిరూర్ లో స్టాప్ తొలగించారని లాయర్ పీటీ శిజిష్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారట. దీని ని విచారణ కు స్వీకరించిన సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం.. విచారణ చేపట్టేందుకు నిరాకరించిందని తెలుస్తుంది.
ఈ సందర్భంగా లాయర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిందని అంటున్నారు. ఈ సందర్భంగా... రైళ్లకు ఎక్కడ స్టాపింగ్ ఇవ్వాలో తాము ఆదేశించలేమని.. ట్రైన్స్ హాల్టింగ్ అంశం పై రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంటుందని సుప్రీంకోర్టు వెల్లడించిందని తెలుస్తుంది.