పిఠాపురంలో గీతోపదేశం.. పవన్‌కు సైలెంట్ చెక్!!
రాజకీయాల్లో ఉన్న ప్రత్యర్తులు మీడియా వేదికగా అరుపులు, కేకలు పెట్టడం మామూలే. సవాళ్లు , ప్రతిస వాళ్లు రువ్వు కోవడం కూడా తెలిసిందే
By: Tupaki Desk | 22 April 2024 12:43 PM GMTరాజకీయాల్లో ఉన్న ప్రత్యర్తులు మీడియా వేదికగా అరుపులు, కేకలు పెట్టడం మామూలే. సవాళ్లు , ప్రతిస వాళ్లు రువ్వు కోవడం కూడా తెలిసిందే. ఇక, ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న వారైతే.. అరుపులు కేకలు. విమర్శలు, ప్రతివిమర్శలు.. ఆఖరికి పరుష పదాలతో కూడా విరుచుకుపడుతున్నారు. అయితే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో మాత్రం.. ఆయన ప్రత్యర్తి పార్టీ వైసీపీ నుంచి బరిలో ఉన్న గీత మాత్రం పవన్‌పై పన్నెత్తు మాట అనడంలేదు.
పిఠాపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా వంగా గీత పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక, పవన్ ఇక్కడ నుం చి బరిలో ఉన్నారు. నిజానికి ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలుతాయని అందరూ అనుకున్నారు. ఆదిలో ఇలాంటి వాతావరణం చూచాయగా కనిపించింది. కాని.. తర్వాత తర్వాత.. గీత సైలెంట్ అయిపో యారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 11 వరకు ఆమె ఇంటింటికి తిరుగుతున్నారు. సాయంత్రం 5 నుంచి 9 వరకు అలానే చేస్తున్నారు.
ఈ సమయంలో ఎక్కడా పవన్ పేరు కూడా ఆమె ఎత్తడం లేదు. అలాగని.. పవన్‌ను ఆమె తక్కువ అంచ నా కూడా వేయడం లేదు. ఇక్కడే ఉంది.. అసలు కిటుకు. పవన్‌ను విమర్శిస్తే.. అది తనకు వ్యతిరేకంగా మారి.. కాపుల్లో కసి పెంచేలా చేస్తుందన్నది గీత భావనగా ఉంది. అంతేకాదు.. తాను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసింది మాత్రమే ఆమె చెప్పుకొంటున్నారు. ఇక్కడే ఉంటానని, తను ఇక్కడి ఆడపడుచునని.. అంటున్నారు.
అంతే తప్ప.. ఇతర వైసీపీ నాయకుల మాదిరిగా..పవన్ ఇక్కడ గెలిచాక హైదరాబాద్ వెళ్లిపోతారని కానీ. షూటింగుల్లో బిజీ అవుతారనికానీ.. గీత ఎక్కడా చెప్పడం లేదు. పైగా మెగా కుటుంబానికి తాను ఒక సోదరి లాంటిదనని చెబుతున్నారు. అంటే.. ఇక్కడే ఉంది.. అసలు కిటుకు.. దీనిని ఎన్నికల్లో పాజిటివిటీతో కూడిన వ్యతిరేక ప్రచారం అంటారు. పవన్‌ను ఒక్క మాట విమర్శించినా.. అది ఆయనకు ప్లస్ అవుతుందని లెక్కవేసుకున్న.. గీత.. పవన్ పేరు ఎత్తక పోవడానికి ఇదే కారణం. మిగిలినఆలోచనను ఓటర్లకే వదిలేస్తున్నారు. ఇటీవల వడదెబ్బతగిలినస్పృహ కోల్పోయినా.. మరునాడే ఆమె ప్రచారంలో బిజీ కావడం కూడా.. ఈ వ్యూహంలో భాగమే!!