Begin typing your search above and press return to search.

"పిఠాపురం గెలుపు నాదే.."

క‌ట్ చేస్తే.. ఈ పిఠాపురం స్థానం నుంచి వైసీపీ త‌ర‌ఫున ప్ర‌స్తుతం కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీత‌(కాపు) ఇక్క‌డ నుంచి పోటీ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   17 March 2024 3:53 AM GMT
పిఠాపురం గెలుపు నాదే..
X

ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు షెడ్యూల్ వ‌చ్చేసింది. అయితే.. రాష్ట్రంలో 175 నియోజ‌క‌వ‌ర్గాలు ఉండ‌గా.. ఒకే ఒక్క సీటు పై అంద‌రి దృష్టీ ఉంది. అంతేకాదు.. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్నారైల వ‌ర‌కు కూడా.. పిఠాపురం సీటుపై ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నా రు. దీనికి కార‌ణం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇక్క‌డ నుంచి పోటీ చేస్తుండ‌డ‌మే. పైగా 90 శాతం మంది కాపు ఓట‌ర్లు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఉండ‌డ‌మే. అంతేకాదు.. గ‌త ఎన్నిక‌ల్లో ఎదురైన చేదు అనుభ‌వాల నుంచి బ‌య‌ట ప‌డేందుకు ప‌వ‌న్ ఏరికోరి.. మూడు సార్లు ఇక్క‌డ స‌ర్వేలు చేయించుకుని నియోజ‌క‌వ‌ర్గాన్ని ఎంచుకున్నారు. దీంతో ఆయ‌న గెలుస్తారా? ఓడుతారా? ఎలాంటి పోటీ ఇస్తార‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది.

క‌ట్ చేస్తే.. ఈ పిఠాపురం స్థానం నుంచి వైసీపీ త‌ర‌ఫున ప్ర‌స్తుతం కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీత‌(కాపు) ఇక్క‌డ నుంచి పోటీ చేస్తున్నారు. పిఠాపురం నుంచి ఆమె పోటీ చేయ‌డం కొత్త‌కాదు. గ‌తంలోనూ ఇక్క‌డ పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. దీంతో ఆమె కూడా గెలుపుపై ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. ''నేతలు, కార్యకర్తలు, అభిమానుల సాయంతో నేను విజ‌యం సాధిస్తాం. పిఠాపురం నాదే.

పిఠాపురం నియోజకవర్గంపై ఇప్పుడందరి దృష్టి పడిందన్నది వాస్తవమే. పిఠాపురం హాట్ సీట్ అని అందరూ అంటున్నారు. కానీ ఇది కచ్చితంగా నాకు విన్నింగ్ సీట్ కాబోతోంది. శక్తిమాత ఆశీస్సులతో, సీఎం జగన్ మద్దతుతో, నేను పిఠాపురంలో విజయం సాధిస్తాను'' అని ఆమె ధీమా వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం.

ఈ నియోజకవర్గంతో ఎన్నో సంవత్సరాలుగా త‌న‌కు పూర్తి అనుబంధం ఉందని గీత చెప్పారు. వారి కుటుంబాల్లో ఒక సభ్యురాలిగా తాను పెరిగాన‌న్నారు. ''అందరూ నన్ను పిఠాపురం ఆడపడుచు అనే అంటారు. ప్రస్తుతం నేను ఎంపీగా ఉన్నాను. నా పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఎక్కడికి వెళ్లినా పిఠాపురం ఆడపడుచు అనే సంబోధిస్తారు.'' అని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనంతగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాం. ప్రజల మద్దతు నాకే ఉంటుంది. నేను నియోజకవర్గంలో పర్యటించినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా జగన్ బాబు రుణం తీర్చుకోవాలని అంటున్నారు. కాబ‌ట్టి నాదే గెలుపు" అని వంగా గీత పేర్కొన్నారు.