అనితకు పట్టు చిక్కట్లేదా..!
రాష్ట్ర హోం శాఖ మంత్రిగా ఉన్న వంగలపూడి అనితకు.. పట్టు చిక్కట్లేదా? శాఖపై ఆమె పట్టు బిగించలే క పోతున్నారా? ఇదీ.. రెండు రోజులుగా జరుగుతున్న చర్చ
By: Tupaki Desk | 31 Dec 2024 7:30 AM GMTరాష్ట్ర హోం శాఖ మంత్రిగా ఉన్న వంగలపూడి అనితకు.. పట్టు చిక్కట్లేదా? శాఖపై ఆమె పట్టు బిగించలే క పోతున్నారా? ఇదీ.. రెండు రోజులుగా జరుగుతున్న చర్చ. రెండు కీలక పరిణామాలు.. ఈ విషయాన్ని మరోసారి హైలెట్ చేశాయి. గతంలో మహిళలపై దాడులు, అత్యాచారాల విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేరుగా.. చేసిన వ్యాఖ్యలు గుర్తుండే ఉంటుంది. హోంశాఖను తనకు ఇచ్చి ఉంటే అంటూ .. ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. లైన్‌లో పెట్టలేరా? అని నిలదీశారు.
అయితే, ఈవ్యాఖ్యలు వివాదం కాకుండా సరిచేసుకున్నారు. అనిత మరుసటి రోజు పవన్‌కల్యాణ్‌ను కలిసి వివరణ ఇవ్వడం తెలిసిందే. ఇక, ఈ వివాదం సర్దుకుంది.. అనుకునేలోగానే.. ఇప్పుడు రెండు పరిణామా లు అనితకు మరోసారి టెస్టుగా మారాయి. 1) పవన్ కల్యాణ్ పర్యటనలో ఫాలో అయిన నకిలీ ఐపీఎస్ అధికారి. 2) నడిరోడ్డుపై పోలీసులు వ్యవహరించిన తీరు. ఈ రెండు ఘటనలు కూడా మంత్రి అనితకు ఇబ్బందిగానే మారాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ వ్యవహారం చాలా సీరియస్‌గానే ఉంది.
దీనిపై సీఎం చంద్రబాబు సైతం ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. ఇక, ఈ విషయంపై గతంలో మాది రిగా కాకుండా హోం శాఖ చూసుకుంటుందని పవన్ వ్యాఖ్యానించి వదిలేశారు. కానీ, అంతర్గతంగా మా త్రం అనితపై సీఎం చంద్రబాబు ఆగ్రహంతోనే ఉన్నట్టు సమాచారం. ఇక, రెండో విషయానికి వస్తే.. నడిరోడ్డుపై కడప పోలీసులు వ్యవహరించిన తీరు. వైసీపీ నాయకుడు, ప్రముఖ లాయర్ సుదర్శన్‌రెడ్డిని గల్లా పట్టుకుని అరెస్టు చేసిన తీరు.. వివాదానికి దారితీసింది.
ఈ విషయంలోనూ అనిత ప్రమేయం లేకపోవడం.. అధికారులు మరో మంత్రి చెప్పినట్టు వినడం.. వారి సొంత నిర్ణయాలు తీసుకోవడం వంటివి అంతర్గతంగా వివాదానికి దారితీసింది. వాస్తవానికి హోం శాఖ మంత్రిగా అనిత ఆదేశాలు ఉండాలి. కానీ, ఈ విషయం ఆమెకు తెలియక పోవడం గమనార్హం. అంతేకా దు.. కొందరు అధికారులు ఓ మంత్రి మెప్పుకోసం ఇలా వ్యవహరించారని చర్చ సాగుతోంది. దీనిపై వైసీపీ ఇప్పటికే కోర్టుకు వెళ్లింది. ఈ క్రమంలో హోం శాఖ మంత్రిగా అనిత ఏం చెబుతారనే విషయం ఆసక్తిగా మారింది. ఎలా చూసుకున్నా.. అనిత ఇప్పుడు సెంటరాఫ్‌ది టాక్ అయ్యారన్నది వాస్తవం.