Begin typing your search above and press return to search.

వంగ‌వీటి ఆత్మ శాంతిస్తుందా..?

అంతేకాదు.. మంత్రిగా కూడా.. చంద్ర‌బాబు రాధాకు పెద్ద‌పీట వేస్తున్నార‌న్న‌ది చ‌ర్చ‌గా మారింది. అయితే..దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు.

By:  Tupaki Desk   |   23 Jun 2024 4:57 AM GMT
వంగ‌వీటి ఆత్మ శాంతిస్తుందా..?
X

వంగ‌వీటి రాధా. సుదీర్ఘ‌కాలంగా ఎలాంటి గుర్తింపు లేకుండా పోయిన యువ నాయ‌కుడు. తండ్రి వార‌స త్వంతో రాజ‌కీయ అరంగేట్రం చేసిన రాధాకు ఇప్పుడు గుర్తింపు ల‌భిస్తోంద‌న్న వార్త వెలుగు చూస్తోంది. ఇదే నిజ‌మైతే.. వంగ‌వీటి ఆత్మశాంతిస్తుంద‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. 2004లో తొలిసారి రాజ‌కీయ అరంగేట్రం చేసిన రాధా.. త‌న తండ్రి వార‌స‌త్వంతో వెలుగులోకి వ‌చ్చారు. ఆ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్నారు.

త‌ర్వాత‌.. ప్ర‌జారాజ్యం పార్టీ స్థాప‌న‌తో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి చెబుతున్నా.. విన‌కుండా.. ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కానీ ఎన్నిక‌ల‌లో మాత్రం చిత్తుగా ఓడిపోయారు. 2009 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు కూడా రాధా ప‌రిస్థితి తిరోగ‌మ‌నంలోనే ఉంది త‌ప్ప‌.. పుంజుకున్న పాపాన పోలేదు. వైసీపీలో ఉన్న‌ప్పుడు.. కొంత మెరుగైన ప‌రిస్థితి ఉంద‌ని ఆశించినా.. ఆయ‌న అలిగి బ‌య‌ట‌కు వ‌చ్చారు. టీడీపీలో చేరారు. ఇక్క‌డ కూడా..ఆయ‌న మ‌న‌సుకు న‌చ్చిన సీటు(విజ‌య‌వాడ సెంట్ర‌ల్‌) ద‌క్క‌లేదు.

2019, 2024లో అసలు పోటీకి కూడా రాధా దూరంగా ఉన్నారు. తాజా ఎన్నికల్లో మాత్రం కూట‌మి పార్టీల త‌ర‌ఫున‌.. కొంత మేర‌కు ప్ర‌చారం చేశారు. ముఖ్యంగా ప‌వ‌న్ కోసం.. ప్ర‌య‌త్నించారు. క‌ట్ చేస్తే.. ప‌వ‌న్ కూడా.. రాధాపై జాలిని ప్ర‌ద‌ర్శించారు. యువ నాయ‌కుడిగా ఉంటూ.. స‌రైన మార్గం ఎంచుకోలేక పోయార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. చాలా భ‌విష్య‌త్తు ఉంద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఇక‌, ఇప్పుడు ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ఇస్తున్నార‌న్న‌ది చ‌ర్చ‌గా మారింది.

అంతేకాదు.. మంత్రిగా కూడా.. చంద్ర‌బాబు రాధాకు పెద్ద‌పీట వేస్తున్నార‌న్న‌ది చ‌ర్చ‌గా మారింది. అయి తే..దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఎమ్మెల్సీ ఇచ్చే అవ‌కాశం వ‌ర‌కు ఓకే అయినా.. మంత్రి వ‌ర్గంలోకి తీసు కుంటారా? లేదా? అనేది చూడాలి. ఏం జ‌రిగినా.. ఈ రెండింటిలో ఏ ప‌ద‌వి ద‌క్కినా.. ఆయ‌న‌కు కొంత రాజ‌కీయంగా బూమ్ వ‌స్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు తెర‌చాటునే ఉండిపోయిన వంగ‌వీటి వార‌సుడు.. ఇక ప్ర‌జ‌ల‌తో మ‌మేకం కావొచ్చు. ఈ ప‌రిణామం సాకార‌మైతే.. వంగ‌వీటి ఆత్మ శాంతిస్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.