వంగవీటికి వైసీపీ ఆఫర్... బెజవాడలో రీ సౌండ్ ...!?
విజయవాడ పార్లమెంట్ పరిధిలోని బాధ్యతలను నిన్నటి టీడీపె ఎంపీ నేటి వైసీపీ నేత అయిన కేశినేని నానికి అప్పగించారు.
By: Tupaki Desk | 12 Jan 2024 3:32 AM GMTవిజయవాడ పార్లమెంట్ పరిధిలోని బాధ్యతలను నిన్నటి టీడీపె ఎంపీ నేటి వైసీపీ నేత అయిన కేశినేని నానికి అప్పగించారు. దాంతో చాలా రాజకీయ సామాజిక సమీకరణలు మారుతాయని అంటున్నారు. విజయవాడ లోక్ సభ పరిధిలో తన వారికి టికెట్లు కేశినేని నాని కోరుతున్నారు అని అంటున్నారు. అందులో భాగంగా కొందరు నేతలను వైసీపీలో చేర్చుకుని టికెట్లు ఇవ్వవచ్చు అని తెలుస్తోంది.
ఇక వంగవీటి మోహన రంగా కుమారుడు రాధాకు వైసీపీ నుంచి ఆఫర్ ఉందని తెలుస్తోంది. విజయవాడ సెంట్రల్ సీటులో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ని ఇంచార్జ్ గా ప్రకటించినా రాధా వైసీపీలో చేరితే ఆ సీటు ఇవ్వడానికి వైసీపీ హై కమాండ్ సుముఖంగా ఉందని అంటున్నారు.
మరో వైపు చూస్తే రాధాని చేర్చుకోవడానికి వైసీపీ ఆసక్తి కనబరుస్తోంది అని అంటున్నారు. ముద్రగడ పద్మనాభం టీడీపీ జనసేనలలో చేరుతారు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో వంగవీటి రంగా వారసుడు అయిన రాధాని వైసీపీలో చేర్చుకోవాలని ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.
వంగవీటి రాధాకు టీడీపీలో సెంట్రల్ సీటు దక్కే అవకాశం లేదు అని అంటున్నారు. ఆ సీటుని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమకు కేటాయించారు. దాంతో రాధాకు పార్టీ అధికారంలోకి వస్తే ఏదైనా పదవి ఇస్తామని చెబుతున్నారని అంటున్నారు. ఈ పరిణామాల క్రమంలో రాధా సైలెంట్ గా ఉన్నారని అంటున్నారు.
ఆయన వైసీపీని వీడిపోవడం వెనక కూడా విజయవాడ సెంట్రల్ సీటు కారణం అంటారు. ఆ సీటుని అప్పట్లో మల్లాది విష్ణుకు జగన్ ఇచ్చారు ఇపుడు విష్ణుని కాదని వెల్లంపల్లి శ్రీనివాస్ కి ఇచ్చారు. అయితే రాధా ఆ సీటు మీద మనసు పడితే ఇచ్చేందుకు వైసీపీ రెడీ అని అంటున్నారు.
ఇంకో వైపు సామాజిక సమీకరణలు ఎత్తుగడలతో వైసీపీ రాధాని చేర్చుకోవాలని చూస్తోంది అని అంటున్నారు. ఇపుడు కేశినేని నాని వైసీపీలో ఉన్నారు కాబట్టి చాలా మంది కీలక నేతలను వైసీపీ వైపు నడిపిస్తారు అని అంటున్నారు.
ముఖ్యంగా ఉమ్మడి క్రిష్ణా జిల్లాల రాజకీయాలలో కేశినేని నాని తనదైన శైలిలో ఆపరేషన్ టీడీపీ కార్యక్రమం చేపడతారు అని అంటున్నారు పొత్తులలో సీట్లు పోయిన వారుంటారు. అలాగే కేశినేని నానికి దగ్గరగా ఉన్న వారు ఉంటారు. అలాంటి వారిని పిలిచి మరీ పెద్ద పీట వేయడానికి కేశినేని నాని ద్వారా వైసీపీ చూస్తోంది అని అంటున్నారు. మొత్తంగా గోదావరి రాజకీయాలలో హీటెక్కించాలని జనసేన టీడీపీ చూస్తూంటే బెజవాడలో రీ సౌండ్ చేయాలని వైసీపీ చూస్తోంది అని అంటున్నారు.