600 ఎకరాల్లో వంతారా అడవి.. ముఖేశ్ అంబానీ కొడుకు లెక్కే వేరు
రిలయన్స్ ఇండస్ట్రీకి చెందిన రిలయన్స్ ఫౌండేషన్ 'వంతారా' అనే సమగ్ర జంతు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లుగా పేర్కొన్నారు.
By: Tupaki Desk | 26 Feb 2024 5:30 PM GMTరిలయన్స్ అన్నంతనే ముఖేశ్ అంబానీ పేరు తప్పించి మరేమీ వినిపించదు. కాలానికి తగ్గట్లే.. ఆయన వారసులు వ్యాపారంలోకి అడుగు పెట్టినప్పటికీ.. ముఖేశ్ మీద మీడియాకు ఉండే అటెన్షన్ ఆయన సంతానం.. వారు చేసే పనుల మీదపెద్దగా ఉండదు. ముఖేశ్ అంబానీ కొడుకుల్లో ఒకరైన అనంత్ అంబానీ తీరు మిగిలిన పారిశ్రామికవేత్తల పిల్లల మాదిరి కాదని చెబుతారు ఆయన గురించి బాగా తెలిసిన వారు. ఇందుకు తగ్గట్లే.. ఆయన గురించి బయట ప్రపంచానికి సరికొత్త విషయాన్ని తాజాగా వెల్లడైంది. అది కూడా ఆయనకు ఆయన వెల్లడించటంతోనే ఈ విషయం బయటకురావటం గమనార్హం.
రిలయన్స్ ఇండస్ట్రీకి చెందిన రిలయన్స్ ఫౌండేషన్ 'వంతారా' అనే సమగ్ర జంతు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లుగా పేర్కొన్నారు. కొవిడ్ ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు దీన్ని నిర్మాణాన్ని షురూ చేసినట్లుగా వెల్లడించారు. 600 ఎకరాల్లో ఒక అడవిని క్రియేట్ చేవారు. సమగ్ర జంతు సంరక్షణ.. పునరావాస కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దారు. దీనికి వంతారా అని పేరు పెట్టారు. వంతారా అడవి అన్నది గాయపడ్డ జంతువుల్ని రక్షించటం.. చికిత్స చేయటంగా పేర్కొన్నారు.
నిజానికి అనంత్ అంబానీకి చిన్నతనం నుంచి జంతువులు అంటే చాలా ఇష్టం. వాటిని కాపాడటం మరింత ఇష్టం. అతనితో పాటు పెరిగి పెద్దదైన అతని అభిలాష ఇప్పుడు 'వంతారా' రూపంలో ఒక మిషన్ గా మారింది. దేశంలో అంతరించిపోతున్న జంతు జాతుల్ని రక్షించటంపై తాము ఫోకస్ చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. తమ ప్రయత్నానికి భారతదేశంతో పాటు.. అంతర్జాతీయంగా కూడా గుర్తింపు లభించినందుకు సంతోషంగా ఉందన్నారు.
ఈ అడవిలో 200 కంటే ఎక్కువ ఏనుగులు ఉన్నాయని.. మొత్తం 100జాతుల కంటే ఎక్కువ జీవులు ఉన్నట్లుగా పేర్కొన్నారు. అరుదైన.. అంతరించిపోతున్న జంతువుల్ని సంరక్షించే ప్రయత్నాలు తాము చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ప్రతి జంతువులోనూ దేవుణ్ని చూస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ అడవిని సంరక్షించేందుకు 300 - 400 మంది పని చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. వారందరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లుగా చెప్పిన అనంత్.. అడవిలో సౌరశక్తిని మాత్రమే ఉపయోగిస్తున్నట్లుగా పేర్కొన్నారు.
భారత్ తో సహా ప్రపంచంలోని అగ్రశ్రేణి జంతుశాస్త్ర నిపుణులు.. వైద్య నిపుణులు కొందరు వంతారా మిషన్ లో భాగమైనట్లుగా వెల్లడించిన అనంత్.. ప్రభుత్వ రంగ సంస్థలు.. ప్రభుత్వ పరిశోధనా సంస్థలు తమకు మార్గదర్శనాన్ని ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. ఈ కృత్రిమ అడవిని గుజరాత్ లోని జామ్ నగర్ లోని రిలయన్స్ రిఫైనరీ కాంప్లెక్స్ ప్రాంతంలో గ్రీన్ బెల్ట్ లోని 600 ఎకరాల్లో నిర్మించారు. ఇందులో జంతువులు నివసించేందుకు వీలుగా.. సహజంగా ఉండేలా వసతులు ఏర్పాటు చేశారు. ఏమైనా.. ఈ ప్రయత్నానికి మనస్ఫూర్తిగా అభినందించాల్సిందే.