Begin typing your search above and press return to search.

వారాహి 3.0... ఫ‌లించేనా? విశ్లేష‌కుల టాక్ ఏంటంటే!

ఈ నెల 10 నుంచి 19వ తేదీ వరకు పవన్ ఇక్కడ వారాహి యాత్ర చేయ‌నున్నారు. ఈ యాత్ర‌ మొత్తం అర్బన్‌ ఏరియాలోనే సాగ‌నుంది.

By:  Tupaki Desk   |   4 Aug 2023 8:57 AM GMT
వారాహి 3.0... ఫ‌లించేనా?  విశ్లేష‌కుల టాక్ ఏంటంటే!
X

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్.. వారాహి యాత్ర 3.0కు రెడీ అయ్యారు. తొలి రెండు యాత్ర‌ల్లోనూ ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌ను టార్గెట్ చేసుకున్న ప‌వ‌న్‌.. ఇప్పుడు విశాఖ‌పై గురి పెట్టారు. ఇక్క‌డ వారాహి యాత్ర‌కు సంబంధించిన షెడ్యూల్ కూడా ఖ‌రారైంది.

ఈ నెల 10 నుంచి 19వ తేదీ వరకు పవన్ ఇక్కడ వారాహి యాత్ర చేయ‌నున్నారు. ఈ యాత్ర‌ మొత్తం అర్బన్‌ ఏరియాలోనే సాగ‌నుంది. జీవీఎంసీ పరిధిలోని నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వారాహి 3.0 ఉండ‌నుంది.

ఆ 9 రోజులు కూడా ప్రతిరోజూ ఒక కార్యక్రమం ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. వీర మ‌హిళ‌ల‌తో ఇంట‌రాక్ష‌న్‌, యువ నాయ‌కుల‌తో భేటీ, ప్ర‌జ‌వాణి ఇలా.. ప‌లు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు. అదేస‌మ‌యంలో స‌భ‌లు, స‌మావేశాలు కూడా ఉంటాయి.

ఇక‌, విశాఖ‌, అన‌కాప‌ల్లి(ఉమ్మ‌డి విశాఖ‌)లో ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురైన భూముల‌ను ప‌వ‌న్ ప‌రిశీలిస్తారు. నగరంలోని కాలుష్యం, బీచ్‌లోకి వెళ్లేందుకు రుసుము(తీసేశారు) వంటి అంశాల‌పైనా మాట్లాడ‌నున్నారు.

మ‌రీ ప్ర‌ధానంగా కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహిస్తారు. గంగవరం పోర్టు ఇబ్బందులు, విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల‌ను ప‌రామ‌ర్శించ‌డం, వారికి సంఘీభావం ప్ర‌క‌టించ‌డం ఇలా, అనేక కార్య‌క్ర‌మాల్లోనూ ప‌వ‌న్ పాల్గొంటారు.

అయితే.. ఇక్క‌డ షెడ్యూల్ బాగుంది. స‌మావేశాలు కూడా బాగున్నాయి. కానీ, తొలి రెండు యాత్ర‌ల మాదిరిగా.. దీనిని ఒక అంశానికి ముడిపెడితే ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

వారాహి 1.0 యాత్ర విష‌యాన్ని తీసుకుంటే.. ఇది కేవ‌లం కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్ చుట్టూ తిరిగింది. దీంతోఅస‌లు ప్ర‌యోజ‌నం నెర‌వేర‌లే. వారాహి 2.0 యాత్ర వ‌లంటీర్ల చుట్టూ తిరిగింది.

ఇది కూడా.. వివాదానికి దారితీసి.. విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌ల‌కు ప‌రిమిత‌మైంది. ఇప్పుడు చేప‌ట్టే యాత్ర వారాహి 3.0 అయినా.. ప్ర‌యోజ‌నం చేకూర్చేలా.. ఒక విష‌యానికే ప‌రిమితం కాకుండా.. ఉండాల‌ని విశ్లేష‌కులు సూచిస్తున్నారు.