Begin typing your search above and press return to search.

హోం మంత్రి అనితకు ప్రత్యర్ధి ఆమె ?

తెలుగు మహిళా ప్రెసిడెంట్ గా ఉంటూ అనిత నాటి హోం మంత్రులను విమర్శించే వారు ఇపుడు వైసీపీ మహిళా అధ్యక్షురాలిగా ఉన్న కళ్యాణి కూడా అనిత బాటలో నడుస్తున్నారు.

By:  Tupaki Desk   |   26 Aug 2024 9:30 PM GMT
హోం మంత్రి అనితకు ప్రత్యర్ధి ఆమె ?
X

మహిళా మంత్రులు హోం మంత్రులు కావడం ఉమ్మడి ఏపీ నుంచి ఒక కొత్త ట్రెండ్ గా మారింది. ఉమ్మడి ఏపీలో సబితా ఇంద్రారెడ్డిని హోం మంత్రిగా చేసిన ఘనత వైఎస్సార్ ది. ఇక విభజన ఏపీలో వైసీపీ 2019లో అధికారంలోకి వచ్చాక ఇద్దరు మహిళా నాయకురాళ్ళను రెండు విడతల మంత్రివర్గ కూర్పులో హోం మంత్రులుగా చేశారు. మొదటి విడతలో హోం మంత్రిగా మేకతోటి సుచరిత పనిచేస్తే రెండోసారి కూర్పులో ఆ శాఖను తానేటి వనితకు అప్పగించారు.

ఇక ఇదే ఒరవడిని కంటిన్యూ చేస్తూ చంద్రబాబు హోం మంత్రిగా ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన వంగలపూడి అనితకు చాన్స్ ఇచ్చారు. ఆమె వైసీపీ ప్రభుత్వం మీద అయిదేళ్ల పాటు పోరాటం చేశారు. ఆమె విపక్షంలో టీడీపీ ఉన్నపుడు ఒక మహిళా నేతగా తన శక్తికి మించి పనిచేశారు. ఆ సమయంలోనే ఆమె మంత్రి అవుతారు అనుకున్నారు. కానీ చంద్రబాబు అత్యంత కీలకమైన హోం మంత్రిత్వ శాఖనే కట్టబెట్టారు.

అయితే హోం మంత్రిగా అనిత గత రెండున్నర నెలలలోనే ఇబ్బందులే పడుతున్నారు. ఏపీలో వైపు మహిళల మీద అత్యాచారాలు ఆగడం లేదు, మరో వైపు గంజాయి వ్యాప్తి కూడా సాగుతోంది. ఇక ఉమ్మడి విశాఖ జిల్లాలో వరసబెట్టి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఫార్మా కంపెనీలలో ప్రమాదాలు జరుగుతునాయి. అచ్యుతాపురం సెజ్ లో భారీ ప్రమాదం జరిగి 17 మంది చనిపోతే పరవాడ సెజ్ లో ముగ్గురు మరణించారు. వీటితో పాటు రూరల్ జిల్లాలో ఒక ప్రైవేట్ హాస్టల్ లో కలుషిత ఆహారం తిని చిన్నారులు మరణించడం కూడా ఏపీ లో హైలెట్ న్యూస్ అయింది.

ఇలా హో మంత్రి ఇలాకాలోనే ప్రమాదాలు జరుగుతుండడంతో వైసీపీకి ఆమె టార్గెట్ అవుతున్నారు. ఇక అనిత మీదకు ప్రయోగించడానికి వైసీపీ ఒక ఆయుధాన్ని తయారు చేసి ఉంచారు. ఆమె ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. ఆమెను తాజాగా ఏపీ మహిళా అధ్యక్షురాలిగా నియమించారు. దాంతో ఎమ్మెల్సీ పదవితో పాటు పార్టీ పదవి కూడా ఆమెకు ఉండడంతో ఆమె హోం మంత్రిని టార్గెట్ చేస్తున్నారు. అనితను హోం మంత్రిగా విఫలం అయ్యారని వరుదు కళ్యాణి ఘాటు విమర్శలతో కార్నర్ చేస్తున్నారు.

హోం మంత్రి బాధ్యతల నిర్వహణలో విఫలం అయ్యారని అదే సమయంలో ఆమె తన హోదాను మర్చి అనుచిత విమర్శలు చేస్తూ విపక్ష వైసీపీ మీద నిందలు వేస్తున్నారని వరుదు కళ్యాణ్ ద్వజమెత్తారు. ప్రతీ రోజూ వైసీపీ మీద, తమ అధినేత జగన్‌ మీద విమర్శలు చేయడమే అనిత ఎజెండాగా మారిందని అన్నారు.

ఏపీలో ఎక్కడ చూసినా శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, ఎక్కడిక్కడ హత్యలు, హత్యాయత్నాలు, దాడులు, ఆస్తుల విధ్వంసం కొనసాగుతున్నా, హోం మంత్రి ఏనాడూ స్పందించలేదని ఆమె ఘాటైన కామెంట్స్ చేశారు. ఆఖరుకు ముచ్చుమర్రిలో అత్యాచారానికి గురై అదృశ్యమైన బాలిక కుటుంబాన్ని కూడా హోం మంత్రి ఈ రోజు దాకా పరామర్శించలేదని గుర్తు చేశారు.

ఇక అచ్యుతాపురం సెజ్‌లోని ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదం విషయంలో హోం మంత్రి బాధితులను ఆదుకోవడంలో, కంపెనీ యాజమాన్యం పై చర్యలు తీసుకోవడంలోనూ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె మండిపడ్డారు.

మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ ఆఫీస్‌లో అగ్ని ప్రమాదం జరిగితే హుటాహుటిన డీజీపీ, సీఐడీ చీఫ్‌ను హెలికాప్టర్‌లో పంపిన విషయాన్ని గుర్తు చేసిన ఆమె అచ్యుతాపురం సెజ్‌లో బ్లాస్ట్‌ తర్వాత సహాయ చర్యల పర్యవేక్షణకు ఎవరినీ ఎందుకు పంపలేదని నిలదీశారు. అంటే కాగితాలకు ఇచ్చిన విలువ ఉత్తరాంధ్ర ప్రజలపై లేదా అని వరుదు కళాణి

మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకుడు అయిన జగన్‌ని ఏకవచనంతో సంబోధిస్తూ హోం మంత్రి చేస్తున్న విమర్శలు, దారుణంగా ఉన్నాయని ఆమె నిందించారు. కేవలం రాజకీయ విమర్శలకే పరిమితమైన అనిత, హోం మంత్రిగా బాధ్యతలు పూర్తిగా మార్చారని దుయ్యబట్టారు. చివరకు ఆమె సొంత జిల్లాలో ఒక బాలికపై అత్యాచారం జరిగితే ఆమె చనిపోతే.కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించలేదని వైసీపీ మహిళా ఎమ్మెల్సీ విమర్శించారు.

అనిత ఇకనైనా హోం మంత్రి బాధ్యతతో వ్యవహరించాలని, అనవసర విమర్శలు, నిందలు మానాలని ఆమె హితబోధ చేశారు. మొత్తానికి చూస్తే అనితకు కళ్యాణి ప్రత్యర్థిగా మారారు అని అంటున్నారు. తెలుగు మహిళా ప్రెసిడెంట్ గా ఉంటూ అనిత నాటి హోం మంత్రులను విమర్శించే వారు ఇపుడు వైసీపీ మహిళా అధ్యక్షురాలిగా ఉన్న కళ్యాణి కూడా అనిత బాటలో నడుస్తున్నారు. దాంతో అనితకు సొంత జిల్లాలోనే ప్రత్యర్ధి గట్టిగానే ఉన్నారు అని అంటున్నారు.