Begin typing your search above and press return to search.

ఓ తండ్రి, ఓ టీచర్.. బాబు మందలింపుపై మంత్రి క్లారిటీ!

అవును... మంత్రి వాసంశెట్టి సుభాష్ పై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   5 Nov 2024 1:30 PM GMT
ఓ తండ్రి, ఓ టీచర్.. బాబు మందలింపుపై  మంత్రి క్లారిటీ!
X

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. తన కేబినెట్ లోని మంత్రి వాసంశెట్టి సుభాష్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే! దీనికి సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మీకు ఇంకా సీరియస్ నెస్ రాలేదంటూ బాబు మండిపడిన వ్యాఖ్యలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి సుభాష్ స్పందించారు.

అవును... మంత్రి వాసంశెట్టి సుభాష్ పై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. నవంబర్ 6తో ముగియనున్న ఓటర్ల నమోదును సీరియస్ గా తీసుకోలేదంటూ మంత్రిపై ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. నేతలతో టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడిన సీఎం ఈ మేరకు గట్టిగా క్లాస్ తీసుకున్నారు!

ఈ నేపథ్యంలో స్పందించిన మంత్రి సుభాష్... చంద్రబాబు తనను మందలించిన ఆడియోతో తనను తెగ ట్రోల్స్ చేశారని.. అయినప్పటికీ తనకు మంచే జరిగిందని చెప్పుకొచ్చారు. తాను ప్రైవేట్ గా ప్రమోట్ చేయించుకుంటే ఎంతో ఖర్చు అయ్యేదని.. కానీ, వైసీపీ, ఓ వర్గం మీడియా తనకు ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చిందని అన్నారు.

ఫలితంగా... పట్టభద్రుల ఓట్ల నమోదు 26 శాతం నుంచి 41 శాతానికి పెరిగిందని తెలిపారు. ఇదే సమయంలో... అసలు వార్డు మెంబర్ కూడా కాని తనకు చంద్రబాబు నేరుగా ఎమ్మెల్యె టిక్కెట్, మంత్రి పదవి ఇచ్చారని, శెట్టిబలిజ సామాజిక వర్గాన్ని ప్రోత్సహించారని అన్నారు.

తన అలసత్వం వల్లే తప్పు జరిగిందని.. అందువల్లే చంద్రబాబు ఓ తండ్రిలా వ్యవహరించి, తన తప్పు సరిచేసుకునే ప్రయత్నం చేశారని మంత్రి అన్నారు. ఓ టీచర్ విద్యార్థిని మందలించినా, కొట్టినా అది ఆ విద్యార్థి శ్రేయస్సు కోసమేనని చెప్పుకొచ్చారు. అయితే.. దీన్ని ప్రతిపక్షం మాత్రం వేరే కోణంలో చూస్తుందని తెలిపారు!

ఇక చంద్రబాబు.. పార్టీ విషయాల్లో చాలా స్పష్టంగా ఉంటారని.. కిందిస్థాయి కార్యకర్తల్ని పట్టించుకుంటున్నారో లేదో గమనిస్తూనే ఉంటారని.. ఎన్నికల్లో తన గెలుపుకోసం కష్టపడిన వారిని ఆయన ఎప్పుడూ మరిచిపోరని సుభాష్ తెలిపారు. ప్రత్యర్థుల ఏడుపులే తనకు దీవెనలని అన్నారు. నిన్నటి నుంచి తన నియోజకవర్గంలో భారీగా ఓట్లు నమోదు చేసుకున్నారని అన్నారు.