Begin typing your search above and press return to search.

వాసిరెడ్డి పద్మ త్వరలో కాంగ్రెస్ లో చేరిక!!

వాసిరెడ్డి పద్మ వైసీపీకి రాజీనామా చేయాలని ఫిక్సయ్యారని అంటున్న నేపథ్యంలో.. ఆమె తదుపరి మజిలీ కాంగ్రెస్ పార్టీ అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   23 Oct 2024 5:10 AM GMT
వాసిరెడ్డి పద్మ త్వరలో కాంగ్రెస్  లో చేరిక!!
X

ఏపీలో ఈ ఏడాది జరిగిన సార్వతిక ఎన్నికల్లో భారీ దెబ్బ తిన్న వైసీపీకి.. ఎన్నికల ఫలితాల అనంతరం కూడా వరుస దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే రాజ్యసభ సభ్యులు, కీలక నేతలు పార్టీని వీడగా.. మరికొంతమంది క్యూ లో ఉన్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ సమయంలో వాసిరెడ్డి పద్మ షాకిచ్చారు!

అవును... ఏపీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉందని చెప్పాలి. పలువురు సీనియర్లు ఇప్పటికే పార్టీని వీడి వెళ్లగా.. మరికొంతమంది క్యూలో ఉన్నారని అంటున్నారు. "యా సీనియర్లు పోతాన్నారమ్మా.. పోతే ఏమైతాది.. ఇంకొకరు వస్తారు" అని జగన్ పైకి చెబుతున్నా.. ఇవి పెద్ద దెబ్బలే అని అంటున్నారు.

ఈ నేపథ్యంలో మరో కీలక నేత వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో జగ్గయ్య పేట టిక్కెట్ ఆశించిన ఆమెకు.. అవకాశం దక్కలేదు! ఇటీవల జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైసీపీని వీడి జనసేనలో చేరడంతో ఖాళీ అయిన నియోజకవర్గ ఇన్ ఛార్జ్ పోస్ట్ తనకు ఇస్తారని పద్మ ఆశించారని అంటారు.

అయితే ఇటీవల జగ్గయ్య పేట ఇన్ ఛార్జ్ గా తన్నీరు నాగేశ్వర రావుని నియమించారు పార్టీ అధినేత జగన్. ఈ నేపథ్యంలోనే హర్ట్ అయిన వాసిరెడ్డి పద్మ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.

త్వరలో కాంగ్రెస్ లో చేరిక?

వాసిరెడ్డి పద్మ వైసీపీకి రాజీనామా చేయాలని ఫిక్సయ్యారని అంటున్న నేపథ్యంలో.. ఆమె తదుపరి మజిలీ కాంగ్రెస్ పార్టీ అని అంటున్నారు. అందుకు గల బలమైన కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇందులో భాగంగా ఏపీ పీసీసీ చీఫ్ షర్మిళకు వాసిరెడ్డి పద్మ చాలా సన్నిహితురాలని.. ఈమెకు షర్మిళ ఆర్థికంగా కూడా సపోర్ట్ చేశారని అంటుంటారు.

ఈ క్రమంలో జగ్గయ్యపేట ఇన్ఛార్జ్ పదవిపైనా ఆశలు పోయిన నేపథ్యంలో... షర్మిళ సలహా మేరకు ఆమె వైసీపీకి రాజీనామా చేశారని.. ఈ నేపథ్యంలోనే ఆమె త్వరలో హస్తం అందుకోనున్నారని అంటున్నారు. షర్మిళ సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారని సమాచారం!!

కాగా... ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన వాసిరెడ్డి పద్మ.. ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనం, అనంతర పరిణామాల నేపథ్యంలో వైసీపీలో చేరారు. అధికార ప్రతినిధిగానూ పనిచేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ గానూ సేవలందించారు.