Begin typing your search above and press return to search.

'నా కుమార్తెను అక్రమంగా నిర్బంధించారు '... ప్రెసిడెంట్ కి తండ్రి లేఖ!

అవును... భారత సంతతికి చెందిన ప్రముఖ స్విస్ పారిశ్రామికవేత్త పంకజ్ ఓస్వాల్ తన 26 ఏళ్ల కుమార్తె వసుంధర ఓస్వాల్ ను ఉగాండాలో అక్రమంగా బంధించారని.. జైలులో ఉంచారని ఆరోపించారు.

By:  Tupaki Desk   |   15 Oct 2024 12:18 PM GMT
నా కుమార్తెను అక్రమంగా నిర్బంధించారు ... ప్రెసిడెంట్  కి తండ్రి లేఖ!
X

భారత సంతతికి చెందిన ప్రముఖ స్విస్ పారిశ్రామికవేత్త ఉగాండాలో నిర్బంధానికి గురయ్యారు. ఈ వ్యవహారంపై ఆమె తండ్రి, స్విస్ లో ప్రముఖ వ్యాపారవేత్తగా పేరు గడించిన భారత సంతతికి చెందిన పంకజ్ ఓస్వాల్.. తాజాగా ఉగాంఢా అధ్యక్షుడు యోవేరి ముసివేని కి లేఖ రాయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఈ విషయం సంచలనంగా మారింది.

అవును... భారత సంతతికి చెందిన ప్రముఖ స్విస్ పారిశ్రామికవేత్త పంకజ్ ఓస్వాల్ తన 26 ఏళ్ల కుమార్తె వసుంధర ఓస్వాల్ ను ఉగాండాలో అక్రమంగా బంధించారని.. జైలులో ఉంచారని ఆరోపించారు. ఈ మేరకు ఉగాండా అధ్యక్షుడికి రాసిన బహిరంగ లేఖలో.. తన కుమార్తె ప్రాథమిక హక్కులను హరించారని అన్నారు. న్యాయ సహాయం పొందడానికి కూడా అనుమతించడం లేదని ఆరోపించారు.

పంకజ్ జైస్వాల్ తెలిపిన వివరాల ప్రకారం.. పీ.ఆర్.ఓ. ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన వసుంధర జైస్వాల్ ను అక్టోబర్ 1 నుంచి ఎటువంటి విచారణ లేకుండా నిర్భందించారు. కార్పొరేట్, రాజకీయ అవకతవకల ఆరోపణలపై అధికారులు ఎటువంటి విచారణ జరపకుండానే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. తమ కంపెనీకి చెందిన మాజీ ఉద్యోగి చేసిన తప్పుడు ఆరోపణలతో ఈ పనికి పూనుకున్నారు!

అతడు తమ వద్ద నుంచి విలువైన వస్తువులను దొంగిలించడంతోపాటు.. ఓస్వాల్ ఫ్యామిలీ నుంచి 2,00,000 డాలర్ల రుణం తీసుకున్న మాజీ ఉద్యోగి అని పేర్కొన్నారు! ఇదే సమయంలో.. తన కుమార్తె ఏకపక్ష నిర్భంధంపై ఐక్యరాజ్యసమితి వర్కింగ్ గ్రూప్ లో అత్యవసర అప్పీల్ ను కూడా దాఖలు చేశారు పంకజ్ జైస్వాల్.

ఈ సందర్భంగా... ఆమెను అపరిశుభ్రమైన ప్రదేశంలో ఉంచి విచారించారని.. అదే ప్రదేశంలో 90 గంటలపాటు నిర్భందించారని.. దీనిపై విచారణ జరిపిన స్థానిక కోర్టు ఆమెను విడుదల చేయాలని ఆదేశించినప్పటికీ పోలీసులు అలసత్వం వహితున్నారని.. పైగా మరిన్ని అభియోగాలు మోపుతున్నారని ఇన్ స్టాలో పోస్ట్ చేశారు!