Begin typing your search above and press return to search.

గద్దర్ కుటుంబానికి అందుకే షాక్ ఇస్తున్నారా?

తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాత్ర తెలిసిందే. విప్లవ వీరుడిగా ఆయన ప్రజల్లో చిరస్థాయిగా నిలుస్తారు

By:  Tupaki Desk   |   6 April 2024 5:30 PM GMT
గద్దర్ కుటుంబానికి అందుకే షాక్ ఇస్తున్నారా?
X

తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాత్ర తెలిసిందే. విప్లవ వీరుడిగా ఆయన ప్రజల్లో చిరస్థాయిగా నిలుస్తారు. తెలంగాణ ప్రజల గుండె చప్పుడు వినిపించిన మహామహుల్లో ఆయన ఒకరు. ఆయన చనిపోతే కనీసం జాలి చూపని రాజకీయ పార్టీల వైఖరి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతోంది. ఆయన గళం నుంచి జాలువారిన పాటలెన్నో తెలంగాణ ప్రజలను చైతన్యవంతులను చేశాయనడంలో సందేహం లేదు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో గద్దర్ కూతురు వెన్నెలను కాంగ్రెస్ అభ్యర్థిగా కంటోన్మెంట్ నుంచి రంగంలోకి దింపింది. బీఆర్ఎస్ నుంచి సాయన్న కూతురు లాస్య నందిత విజయం సాధించింది. కానీ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత మరణించడంతో కంటోన్మెంట్ స్థానం ఖాళీ అయింది. దీంతో అక్కడ నుంచి మరోమారు ఎన్నిక జరపాలని ఎన్నికల సంఘం నిర్ణయించడంతో పోటీ ఏర్పడింది.

ఆమె మరణంతో ఆ స్థానంలో పోటీ ఉండకుండా చూసుకోవాల్సింది పోయి పోటీ అనివార్యమైంది. దీంతో వెన్నెల రాజకీయంగా చురుకుగానే ఉన్నా కాంగ్రెస్ రాజకీయంగా నాటకం ఆడుతోంది. కాంగ్రెస్ నుంచి శ్రీ గణేష్ ను రంగంలోకి దింపింది. అతడిని బీజేపీ నుంచి తీసుకుని మరీ పోటీలో నిలబెట్టింది. దీంతో గద్దర్ కూతురుకు మరోమారు పోటీ తప్పడం లేదు.

కాంగ్రెస్ కపట నాటకం బయట పడిందని బీఆర్ఎస్ చెబుతోంది. శ్రీ గణేష్ కు టికెట్ కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. గద్దర్ కుటుంబం నుంచి పోటీకి వచ్చిన వెన్నెలను గెలిపించుకోవాల్సింది పోయి ఇలా పోటీకి దించడం భావ్యం కాదని పేర్కొంటోంది. కాంగ్రెస్ పార్టీ అవకాశవాద రాజకీయాలను అందరు అసహ్యించుకుంటున్నారు. వెన్నెలను గెలిపించుకోవాలని చూస్తున్నారు.

అద్దంకి దయాకర్ కూడా ఉన్నా శ్రీగణేష్ కు టికెట్ ఇవ్వడం దేనికి సంకేతం అంటున్నారు. వెన్నెలను అడ్డుకోవడానికే పార్టీలు కుటిల యత్నం చేస్తున్నాయి. ఆమెను గెలిపిస్తే గద్దర్ ఆత్మకు శాంతి చేకూరినట్లు అవుతుంది. కానీ రాజకీయ పార్టీల కుమ్ములాటలో ఆమె విజయం సాధిస్తుందో లేదో వేచి చూడాల్సిందే అంటున్నారు ప్రజలు.