Begin typing your search above and press return to search.

వేణు స్వామి మళ్లీ మొదలెట్టాడు !

తాజాగా కన్నడ నటి నిశ్విక నాయుడుతో పూజలు చేయించిన విషయం హాట్ టాపిక్ గా మారింది.

By:  Tupaki Desk   |   26 Jun 2024 3:59 AM GMT
వేణు స్వామి మళ్లీ మొదలెట్టాడు !
X

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల పై రాజకీయ జోస్యం చెప్పి విఫలమైన ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఇక మీదట ఎవరికీ జాతకాలు చెప్పబోనని లెంపలేసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ కన్నడ హీరోయిన్ తో పూజలు చేయించిన వేణు స్వామి వీడియోలు మరోసారి వైరల్ అవుతున్నాయి. జోస్యం చెప్పనన్న వేణు స్వామి మళ్లీ పూజలు చేయించడం మరోసారి చర్చకు దారితీసింది.

వేణు స్వామి అనేకమంది హీరోయిన్లతో పూజలు చేయించిన విషయం తెలిసిందే. నాగచైతన్య, సమంత విడాకుల గురించి ముందే చెప్పి వేణు స్వామి పాపులర్ అయ్యాడు. దాంతో అనేకమంది వేణు స్వామి మాటలను నమ్ముతూ వచ్చారు. తాజాగా కన్నడ నటి నిశ్విక నాయుడుతో పూజలు చేయించిన విషయం హాట్ టాపిక్ గా మారింది.

నిశ్విక నాయుడు 2018లో అమ్మా ఐ లవ్ యూ సినిమాతో తెరంగేట్రం చేసింది. ఇప్పటి వరకు 11 సినిమాలు చేసింది. తాజాగా కన్నడలో విడుదలైన కరటక దమనక చిత్రం ఆమెకు మంచి పేరు తెచ్చింది. ఈ సినిమాలో శివరాజ్ కుమార్ తో పాటు ప్రభుదేవా, ప్రియానంద్ తదితరులు నటించారు. తొలిచిత్రంతోనే నిశ్విక నాయుడు ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్, ఫిల్మ్ బీట్, సైమా అవార్డులకు నామినేట్ కావడం విశేషం.