Begin typing your search above and press return to search.

లైంగిక వేదింపులు 10సెకన్లునేరం కాదు!

విద్యార్థినిపై లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులో ఇటలీలోని ఓ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రస్తుతం వైరల్ గా మారింది.

By:  Tupaki Desk   |   15 July 2023 7:00 AM GMT
లైంగిక వేదింపులు 10సెకన్లునేరం కాదు!
X

విద్యార్థినిపై లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులో ఇటలీలోని ఓ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రస్తుతం వైరల్ గా మారింది. లైంగిక వేధింపుల కేసులు, అనుమతి లేకుండా ఇతరుల సున్నిత భాగాలను తాకిన సమయంలో... "టైం" అని పరిగణలోకి తీసుకున్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

వివరాళ్లోకి వెళ్తే... రోమ్‌ కు చెందిన ఓ 17 ఏళ్ల విద్యార్థిని స్థానిక ప్రైవేటు స్కూల్లో చదువుతోంది. ఈ స్కూల్లో కేర్‌ టేకర్‌ గా పనిచేస్తున్న 66 ఏళ్ల ఆంటోనియో అవోలా తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని గతేడాది ఏప్రిల్‌ లో ఫిర్యాదు చేసింది.

ఆ రోజు తాను స్నేహితురాలితో కలిసి స్కూల్లో మెట్లెక్కుతుండగా.. కేర్‌ టేకర్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని బాధితురాలు పేర్కొంది. ఆ సమయంలో అతడు తన పిరుదులను తాకడం, లోదుస్తులను లాగడం చేశాడని కోర్టుకు తెలిపింది. ఈ సమయంలో తాను సీరియస్ గా చూడటంతో.. జోక్ చేశానని చెప్పాడని తెలిపింది.

దీంతో పోలీసులు ఆంటోనియోపై కేసు నమోదు చేసిన స్థానిక కోర్టులో విచారణ నిమిత్తం హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఆ విద్యార్థినిని తాను తాకడం నిజమేనని అంగికరించిన ఆంటోనియో... తాను సరదాగానే అలా చేశానని కోర్టుకు తెలిపాడు. అయితే వాదోపవాదాలు విన్న న్యాయస్థానం తాజాగా తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.

"కామవాంఛతో ఈ పనిచేయలేదని, కేవలం సరదాగా చేసినట్లు నిందితుడు చెప్పిన వాదనను మేం అంగీకరిస్తున్నాం. అంతేగాక.. బాలికను అతడు కేవలం 5 నుంచి 10 సెకన్ల లోపు మాత్రమే తాకాడు కాబట్టి.. దీన్ని నేరంగా పరిగణించడం అనాలోచితమే అవుతుంది" అని వ్యాఖ్యానించిన కోర్టు ఈ కేసును కొట్టివేసింది.

దీంతో సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ గా మారింది. తీర్పు వచ్చినప్పటి నుండి, #10secondi హ్యాష్‌ ట్యాగ్‌ తో పాటు ఇటలీలోని ఇన్‌ స్టాగ్రామ్, టిక్‌ టాక్‌ లో 10 సెకన్ల పాటు తమ శరీర భాగాలను తాకుకుంటూ పెడుతున్న వీడియోలు ట్రెండ్‌ అవుతున్నాయి.

అయితే ఈ విషయంపై ముందుగా నటుడు పాలో కామిల్లి పోస్ట్ చేశారట. అప్పటినుంచి వేలాది మంది దీనిని అనుసరించారని తెలుస్తుంది. ఇదే సమయంలో ఇన్‌ స్టా లో 29.4 మిలియన్ల మంది ఫాలోవర్స్ ని కలిగి ఉన్న ఇటలీ అత్యంత ప్రసిద్ధ ప్రభావశీలి చియారా ఫెరాగ్ని మరొక వీడియోను రీపోస్ట్ చేసారట.

ఈ సందర్భంగా... పోస్ట్ చేస్తున్న ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. "మగవాళ్ళకి ఆడవాళ్ళ శరీరాలను తాకే హక్కు ఒక్క సెకను కూడా లేదు. కాకపోతే 5 నుంచి 10 సెకన్లు మాత్రం ఉండనివ్వండి" అని ఒకరు ట్వీట్ చేశారు.

"కేర్‌ టేకర్‌ ను నిర్దోషిగా ప్రకటిస్తూ న్యాయమూర్తులు తీసుకున్న నిర్ణయం ఇటాలియన్ సమాజంలో లైంగిక వేధింపులు ఎంత సాధారణీకరించబడిందో చూపిస్తుంది" అని మరో ట్వీట్!

"అతను పిరుదులు తాకాడు.. తర్వాత నన్ను పైకి లాగాడు.. నాకు ఇది ఒక జోక్ కాదు. ఒక వృద్ధుడు టీనేజ్ అమ్మాయిలతో జోక్ చేసే పద్దతి ఇది కాదు" అని ఇంకో ట్వీట్!