Begin typing your search above and press return to search.

అత్యంత ఖరీదైన ఆవు @ రూ. 41 కోట్లు!!

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆవుగా మన ఒంగోలు జాతికి చెందిన గోవు రికార్డు సృష్టించింది.

By:  Tupaki Desk   |   5 Feb 2025 9:24 AM GMT
అత్యంత ఖరీదైన ఆవు @ రూ. 41 కోట్లు!!
X

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆవుగా మన ఒంగోలు జాతికి చెందిన గోవు రికార్డు సృష్టించింది. బ్రెజిల్ జరిగిన వేలంలో రూ.41 కోట్లకు అమ్ముడైన వియాటినా-19 అనే ఆవు గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ లోనూ చోటు సంపాదించింది. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న వియాటినా-19 ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జపాన్ కు చెందిన వాగ్యు, భారత్ కు చెందిన బ్రాహ్మణ్ లను వెనక్కి నెట్టింది.

మన దేశానికి చెందిన ఒంగోలు జాతి రకమైనా వియాటినా-19 బ్రెజిల్ లో పుట్టి పెరిగింది. పశువుల పరిశ్రమలో ఇప్పటివరకు ఉన్న అన్ని రికార్డులను తుడిచేసిన వియాటినా ఆవుల చాంపియన్ ఆప్ ద వరల్డ్ పోటీలో మిస్ సౌత్ అమెరికా కిరీటాన్ని దక్కించుకుంది.

సాధారణంగా ఆవులు 30 నుంచి 40 వేల మధ్యలో అమ్ముడవుతుంటాయి. మేలు జాతి ఆవు రకమైతే గరిష్ఠంగా లక్ష పలుకుతుంది. కానీ, వియాటినా ఏకంగా రూ.41 కోట్ల విలువ చేయడంతో దాని ప్రత్యేకతలు ఏంటనే ఆసక్తి పెంచుతోంది. ఒంగోలు జాతికి ఉండే అద్వితీయమైన శరీర సౌష్ఠవం, జాతి లక్షణం వియాటినాను ప్రత్యేకంగా నిలిపాయి. శరీరం అంతా తెల్లటి రంగులా మిలామిలా మెరిసిపోతూ చూపరులను కట్టిపడేస్తుంది.

వియాటినా పైచర్మం వదులుగా ఉండటం వల్ల ఎంతటి ఉష్ణ వాతావరణాన్ని అయినా తట్టుకుంటుందని చెబుతున్నారు. విశేషంగా ఉంటే దీని మాపురం, బలిష్టమైన కండరాల నిర్మాణం వియాటికాకు అదనపు బలం. దీని అసాధారణ జన్య నిర్మాణం పాడి పశువుల ఉత్పత్తిని మరో మలుపుతిప్పుతుందని భావిస్తున్నారు. దాదాపు 1101 కిలోల బరువుతో ఒంగోలు జాతి ఆవు కంటే డబుల్ సైలులో వియాటినా ఉన్నది.