పవన్ సైడ్ విజయసాయి...అణిచేస్తున్నారు అంటూ !
లేటెస్ట్ ట్వీట్ లో విజయసాయిరెడ్డి అయితే పవన్ కళ్యాణ్ ని కూటమిలో దెబ్బేస్తున్నారు అంటూ టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు మీద డైరెక్ట్ గానే ఎటాక్ చేశారు.
By: Tupaki Desk | 7 Dec 2024 2:58 PM GMTఏపీలో ఏమి జరుగుతోంది అన్నదే అర్థం కావడం లేదు. పవన్ అంటే విపరీతమైన వ్యతిరేకత చూపించే వైసీపీ ఈ రోజు పవన్ గ్రేట్ అంటోంది. వైసీపీలో కీలక నేత, రాజ్యసభ ఎంపీగా ఉన్న వి విజయసాయిరెడ్డి పవన్ పవర్ ఫుల్ స్టార్ అని కొనియాడుతున్నారు.
ఏపీకి ఆయనే ఫ్యూచర్ అని కూడా కితాబు ఇస్తున్నారు. ఏపీలో యంగెస్ట్ లీడర్ పవన్ అని ఓల్డెస్ట్ లీడర్ చంద్రబాబు అని తేడా చూపించారు. పవన్ చేతిలో ఉంటే యంగెస్ట్ స్టేట్ ఏపీ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది అని ట్వీట్ చేసి కూటమిలో కుంపటి పెట్టిన విజయసాయిరెడ్డి ఇక తగ్గేదేలా అంటూ మరో ట్వీట్ తో అదే ఫైర్ కంటిన్యూ చేశారు.
లేటెస్ట్ ట్వీట్ లో విజయసాయిరెడ్డి అయితే పవన్ కళ్యాణ్ ని కూటమిలో దెబ్బేస్తున్నారు అంటూ టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు మీద డైరెక్ట్ గానే ఎటాక్ చేశారు. పవన్ విశ్వసనీయతను దెబ్బ తీయడానికి కూటమి పెద్దలు చూస్తున్నారు అని ఆయన ఆరోపించారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ తన కుమారుడు నారా లోకేష్ కి పోటీ కాకూడదు అన్న ఆలోచనతోనే చంద్రబాబు ఇలా చేస్తున్నారు అని విజయసాయిరెడ్డి చెబుతున్నారు. జల్ జీవన్ మిషన్ పనుల్లో గ్రామీణాభివృద్ధి శాఖ పంచాయతీ శాఖల అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు అని ఆయన విమర్శించారు.
ఆ రెండూ పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న శాఖలు కావడంతో ఆయన ఇమేజ్ కి అలా దెబ్బ తీయాలని చూస్తున్నారు అని విజయసాయిరెడ్డి అంటున్నారు. ఆ రెండు శాఖలలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు అంటూ వచ్చిన వార్తను కూడా ఆయన షేర్ చేయడం విశేషం.
పవన్ విషయంలో ఎటువంటి ఇబ్బంది కూటమిలో కొత్త పోటీ రాకుండా చూసుకునేందుకే చంద్రబాబు తనదైన ట్రేడ్ మార్క్ పాలిటిక్స్ ని అమలు చేస్తున్నారు అని ఆయన అంటున్నారు. ఇదిలా ఉంటే పవన్ సీఎం క్యాండిడేట్ అని నిన్న చెప్పి నేడు పవన్ అణగదొక్కడానికి కూటమి పెద్దలు చూస్తున్నారు అని విజయసాయిరెడ్డి డౌట్లు వ్యక్తం చేయడం చూస్తూంటే విజయసాయిరెడ్డి ఉన్నట్లుండి సడెన్ గా పవన్ సైడ్ తీసుకున్నారా అన్న చర్చ సాగుతోంది.
అయితే పవన్ భుజం మీద నుంచి కూటమి పెద్ద చంద్రబాబు మీద తుపాకీ పెట్టేందుకు వైసీపీ కొత్త ఎత్తులు వేస్తోందని అందులో భాగమే ఇదంతా అని కూడా విశ్లేషించేవారు ఉన్నారు. 2014 నుంచి 2019 మధ్య టెర్మ్ లో బీజేపీకి టీడీపీకి మధ్య గ్యాప్ ని పెంచడంతో విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషించారు అని అప్పట్లో ప్రచారం సాగింది. ఆయనకు ఢిల్లీ పెద్దలు ఆనాడు తరచూ అపాయింట్మెంట్లు ఇవ్వడం వైసీపీకి ప్రాధాన్యత పెరగడంతోనే టీడీపీ నాడు బీజేపీ మీద అలిగి ఆ తరువాత దూరంగా జరిగింది.
దాంతో 2019లో వైసీపీకి సూపర్ సక్సెస్ దక్కింది. టీడీపీ ఒంటరి పోరుతో చిత్తు అయింది. ఇక 2029 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కూటమిలో చిచ్చు రాజేయడానికే వైసీపీ చూస్తోంది అని టీడీపీ నేతలు అంటున్నారు. జనసేన టీడీపీ పాలూ నీళ్ళు మాదిరిగా కలసిపోయాయి. పవన్ కళ్యాణ్ పదేళ్ల దాకా బాబే సీఎం ఇటీవల నిండు అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇచ్చారు.
మరి అంతలా గాఢంగా పెనవేసుకున్న బంధంలో అనుమానం బీజాలను నాటేందుకు విజయసాయిరెడ్డి చూస్తున్నారు అని కూటమి నేతలు అంటున్నారు. రాజకీయాల్లో ఎపుడు ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు, అందువల్ల ఈ రోజు అనుమానాలు రేపటికి పెను భూతాలు అవుతాయా అంటే చెప్పలేని పరిస్థితి. అయితే ఇపుడు మాత్రం విజయసాయిరెడ్డి ట్వీట్లను అంతా జాగ్రత్తగానే గమనిస్తున్నారు. చూడాలి మరి ఫ్యూచర్ లో ఏమి జరుగుతుందో.