Begin typing your search above and press return to search.

అమిత్ షాతో సాయిరెడ్డి భేటీలు కంటిన్యూ !

లేటెస్ట్ గా చూస్తే ఆయన అమిత్ షాను కలిసారు. అరగంట సేపు ఈ భేటీ సాగింది. అనంతరం సాయి రెడ్డి ట్వీట్ కూడా చేశారు.

By:  Tupaki Desk   |   4 Dec 2024 12:30 AM GMT
అమిత్ షాతో సాయిరెడ్డి భేటీలు కంటిన్యూ !
X

కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీకి పెద్ద అయిన అమిత్ షాఎతో వైసీపీ జనరల్ సెక్రటరీ, రాజ్యసభలో ఆ పార్టీ నాయకుడు అయిన వి విజయసాయిరెడ్డి వరస భేటీలు వేస్తున్నారు. లేటెస్ట్ గా చూస్తే ఆయన అమిత్ షాను కలిసారు. అరగంట సేపు ఈ భేటీ సాగింది. అనంతరం సాయి రెడ్డి ట్వీట్ కూడా చేశారు. ఏపీ ప్రయోజనాలు ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ మీదనే ఈ భేటీ సాగిందని ఆయన పేర్కొన్నారు.

ఇవన్నీ పక్కన పెడితే సాయి రెడ్డి కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ పెద్దలతో మంచి రిలేషన్స్ మెయిన్ టెయిన్ చేస్తున్నారు అని ఢిల్లీ వర్గాల టాక్. మూడవసారి కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత జూన్, ఆగస్టు నెలలలో కూడా విజయసాయిరెడ్డి కేంద్ర హోం మంత్రిని కలిసి వచ్చారు. ఆనాడు ఆయనతో భేటీలో అనేక సమస్యలు ప్రస్తావించినట్లు ట్వీట్ చేశారు. ఇపుడు మరోసారి భేటీ వేస్తున్నారు.

ఈ భేటీలు వేయడం అన్నది మామూలుగా అయితే సాధారణంగానే చూడాల్సి ఉంటుంది. ఆయన కేంద్ర హోం మంత్రి. దేశానికే కీలక మంత్రి. ఇక సాయిరెడ్డి చూస్తే రాజ్యసభలో వైసీపీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు. దాంతో ఆయన అమిత్ షాతోనే కాదు కేంద్ర పెద్దలను కూడా కలవచ్చు. అనేక ఇష్యూస్ మీద కూడా మాట్లాడవచ్చు.

అయితే ఏపీలో రాజకీయం చూస్తే వైసీపీ వర్సెస్ టీడీపీ కూటమి అన్నట్లుగా ఉంది. టీడీపీ కూటమిలో జనసేన బీజేపీ మిత్రులుగా ఉన్నాయి. ఏపీకి సంబంధించినంతవరకు బీజేపీ వైసీపీని రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తూ వస్తోంది. మరో వైపు కేంద్రం ప్రవేశపెట్టిన వక్ఫ్ చట్టం సవరణ బిల్లుకు మద్దతు ఇచ్చేది లేదని వైసీపీ యాంటీ బీజేపీ స్టాండ్ తీసుకుంది.

అంతే కాదు ఈవీఎంల వల్ల ఫలితాలలో తేడాలు వస్తున్నాయని మళ్లీ బ్యాలెట్ సిస్టం ని తీసుకుని రావాలని వైసీపీ అధినేత జగన్ వీలైనపుడల్లా డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఇది కూడా బీజేపీకి ఇబ్బందిగానే ఉంటోంది అని అంటున్నారు. ఆ మధ్యన ఢిల్లీలో వైసీపీ నిర్వహించిన ధర్నాకు ఇండియా కూటమి ఎంపీలు హాజరయ్యారు. దాంతో బీజేపీ యాంటీ స్టాండ్ తో వైసీపీ ముందుకు సాగుతుందని అంతా ప్రచారం సాగింది.

ఇవన్నీ ఇలా ఉంటే పార్లమెంట్ లో వైసీపీ ఎంపీలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తో పాటు పోలవరం ఎత్తు తగ్గింపు వంటి వాటి మీద కూడా ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇదిలా ఉంటే సాయిరెడ్డి అమిత్ షాతో భేటీలను కంటిన్యూ చేయడం పట్ల అయితే చర్చ సాగుతోంది. రాజకీయాల్లో అయితే ఇవన్నీ వ్యూహాలే అని చెప్పేవారూ ఉన్నారు.

వైసీపీకి టీడీపీ ఏపీలో రాజకీయ ప్రత్యర్ధి. బీజేపీ మీద అంత రాజకీయ వైరం ఉండదని అంటున్నారు. ఇక రాజకీయాల్లో ఎపుడేమి జరుగుతుందో ఎవరికీ తెలియదు, ఈ బంధాలు స్నేహాలు రేపటి రోజున తారు మారు కూడా కావచ్చు అన్నది కూడా ఉంది. ఆ విధంగా చూస్తే అటు వైసీపీ కూడా అన్నీ ఆలోచించుకునే ఈ విధంగా చేస్తోందా అన్న చర్చ కూడా ఉంది. ఏది ఏమైనా ఏపీలో వైసీపీ ఎన్నడూ లేని విధంగా రాజకీయంగా ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. దాంతో ఆ పార్టీ ప్రణాళికలు దానికి ఉంటాయన్న చర్చ కూడా సాగుతోంది.