Begin typing your search above and press return to search.

అతితెలివి: షర్మిల.. విజయమ్మలపై ఆ పోస్టుల సూత్రధారి దొరికేశాడు

ఫేస్ బుక్ లో నకిలీ ఖాతా తెరిచిన ఉదయ్ భూషణ్ ను అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ సోషల్ మీడియా విభాగానికి చెందిన రవీంద్రారెడ్డి పేరుతో ఒక నకిలీ ఖాతాను తెరిచాడు ఉదయ్.

By:  Tupaki Desk   |   15 Feb 2024 4:23 AM GMT
అతితెలివి: షర్మిల.. విజయమ్మలపై ఆ పోస్టుల సూత్రధారి దొరికేశాడు
X

సోషల్ మీడియాలో నోటికి వచ్చినట్లుగా ఇష్టారాజ్యంగా పోస్టులు పెట్టే ధోరణి ఎక్కువైంది. అతితెలివికి పోయి అడ్డంగా బుక్అయ్యే కొందరు అత్యుత్సాహంతో చేసే పనులకు జైలు బహుమతిగా లభిస్తుంటుంది. తాజాగా అలాంటి అతి తెలివిని ప్రదర్శించిన విశాఖ వాసిని పులివెందుల పోలీసులు పట్టుకున్నారు. జైలుకు పంపారు. సోషల్ మీడియాలో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలపైనా.. ఆమె తల్లి విజయమ్మతో పాటు వైఎస్ వివేకానంద కుమార్తె డాక్టర్ సునీతపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడుతున్న సూత్రధారిని పోలీసులు పట్టుకున్నారు.

ఫేస్ బుక్ లో నకిలీ ఖాతా తెరిచిన ఉదయ్ భూషణ్ ను అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ సోషల్ మీడియా విభాగానికి చెందిన రవీంద్రారెడ్డి పేరుతో ఒక నకిలీ ఖాతాను తెరిచాడు ఉదయ్. విశాఖపట్నం మహారాణిపేటకు చెందిన ఇతడు.. పులివెందులకు చెందిన వర్రా రవీంద్రరెడ్డి పేరుతో ఫేక్ ఖాతాను క్రియేట్ చేశాడు. షర్మిల.. విజయమ్మ.. సునీతమ్మను ఉద్దేశించి దారుణాతి దారుణంగా పోస్టులు పెట్టటం ద్వారా.. వైసీపీ నేతల చేత ఉదయ్ పై దాడి చేసి.. కొట్టేలా చేయటమే ఉదయ్ పన్నాగం.

అందుకే రవీంద్రరెడ్డి పేరు మీద ఫేక్ ఖాతాను క్రియేట్ చేసి.. అభ్యంతరకర పోస్టులు పెట్టాడు. దీంతో.. స్పందించిన రవీంద్రారెడ్డి పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పులివెందుల పోలీసులు ఫేస్ బుక్ ప్రతినిధుల సాయంతో సమాచారం తెప్పించుకొని.. విశాఖపట్నం నుంచి తప్పుడు పోస్టులు పెడుతున్న ఉదయ్ భూషణ్ ను అరెస్టు చేశారు. వైసీపీకి చెందిన వారితో తిట్టించి.. వారిలో వారికి గొడవలు పెట్టటమే ఉదయ్ భూషణ్ దుర్మార్గపు ఆలోచనగా పోలీసులు గుర్తించి.. అతడ్నిజైలుకు పంపారు.