Begin typing your search above and press return to search.

తోడేళ్ల మూట వర్సెస్ సింహం @ 2024... సాయిరెడ్డి రియాక్షన్ వైరల్!

ఇదే సమయంలో మొత్త ప్రతీపక్షం అన్నారంటే... బీజేపీని కూడా టీడీపీ, జనసేనలతో కలిపే సాయిరెడ్డి స్పందించారనే కామెంట్లు వినిపిస్తున్నాయి

By:  Tupaki Desk   |   15 Sep 2023 6:10 AM GMT
తోడేళ్ల మూట వర్సెస్ సింహం @ 2024... సాయిరెడ్డి రియాక్షన్ వైరల్!
X

నిన్నమొన్నటివరకూ ఏపీలో స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు హాట్ టాపిక్ కాగా... ఇప్పుడు చంద్రబాబుని పరామర్శించి, పవన్ కల్యాణ్ టీడీపీ - జనసేన పొత్తు కన్ ఫాం చేసిన ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమయంలో విజయసాయిరెడ్డి స్పందించారు.

అవును... ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటూ తనదైన శైలిలో సమకాలీన సామాజిక, రాజకీయ పరిస్థితులపై స్పందించే విజయసాయిరెడ్డి.. తాజాగా బహిర్గతమైన టీడీపీ - జనసేన అధికారికపొత్తుపై స్పందించారు. ఈ సందర్భంగా విపక్షాలను తోడేళ్ల మూటగా అభివర్ణించిన ఆయన.. జగన్ ని సింహంతో పోల్చారు. దీంతో... "నాన్న సింహం సింగిల్ గానే వస్తుంది.. పందులే గుంపుగా వస్తాయి" అనే కామెంట్ పెడుతున్నారు నెటిజన్లు.

తాజాగా టీడీపీ - జనసేన పొత్తుపై పరోక్షంగా స్పందించిన విజయసాయిరెడ్డి... "ఏపీలో 2024లో జరగనున్న ఎన్నికలు టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ మ‌ధ్య జ‌ర‌గ‌నున్నాయి.. టీడీపీ తోడేళ్ల మూట వ‌ర్సెస్‌ వైసీపీ సింహం, దురాశ వ‌ర్సెస్ ప్రజా సంక్షేమం, యూ ట‌ర్న్ రాజ‌కీయాలు వ‌ర్సెస్ విశ్వస‌నీయ‌త‌, అస్థిర‌త వ‌ర్సెస్ స్థిర‌త్వం, అవ‌కాశ‌వాదం వ‌ర్సెస్ నిజాయితీ, కుల రాజ‌కీయాలు వ‌ర్సెస్ ఐక్యత‌, క్రోనీ క్యాపిటలిజం వ‌ర్సెస్ అంద‌రికీ ప్రయోజ‌నం అంటూ.. మొత్తం ప్రతిప‌క్షం వ‌ర్సెస్ ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్" అంటూ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ తో అనేక విషయాలను తేటతెల్లం చేసే పనికి పూనుకున్నారు విజయసాయిరెడ్డి. ఇందులో భాగంగా... జనసేనను పూర్తిగా టీడీపీతో కలిపేస్తూ... పరోక్షంగా ఆ పార్టీని సైడ్ చేసినంతపనిచేశారు. ఇక్కడ ప్రముఖంగా యూటర్న్ పాలిటిక్స్ అని అనడంపై కామెంట్లు వైరల్ అవుతున్నాయి. 2014లో చంద్రబాబుని పూర్తిగా ప్రత్యక్షంగా సపోర్ట్ చేసిన పవన్... 2019లో అధికారికంగా విభేదిస్తూ విమర్శించిన సంగతి తెలిసిందే.

ఇదే సమయంలో మొత్త ప్రతీపక్షం అన్నారంటే... బీజేపీని కూడా టీడీపీ, జనసేనలతో కలిపే సాయిరెడ్డి స్పందించారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే టీడీపీ-జనసేన కూటమిలో చేరాలని బీజేపీలోని కొంతమంది నేతలు స్పందిస్తున్నారని తెలుస్తుండగా.. బాబుతో పొత్తును పలువురు విభేదిస్తున్నారని తెలుస్తుంది. ఈ సమయంలో బీజేపీని సైతం టీడీపీ-జనసేలతో కలిపి విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారని... సింహం సింగిల్ గానే అనే సంకేతాలు ఇచ్చారని అంటున్నారు పరిశీలకులు.