Begin typing your search above and press return to search.

మధ్యంతర ఎన్నికలు అంటున్న వైసీపీ సీనియర్

వైసీపీలో నంబర్ టూ గా ఉంటూ ఢిల్లీకి ఎంతో సన్నిహితంగా ఉంటే ఎంపీ విజయసాయిరెడ్డి ఈ విషయాన్ని వెల్లడించడం విశేషం.

By:  Tupaki Desk   |   15 July 2024 9:16 AM GMT
మధ్యంతర ఎన్నికలు అంటున్న వైసీపీ సీనియర్
X

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అయిదేళ్ళ కాలం ఉండదా అంటే ఈ డౌట్ మొదటి నుంచి ఇండియా కూటమి నేతలే వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే ఇపుడు ఎన్డీయేకి మిత్రుడు కాని మిత్రుడు అయిన వైసీపీ కూడా ఇదే డౌట్ ని వ్యక్తం చేస్తోంది. పార్లమెంట్ కి మధ్యంతర ఎన్నికలు రావచ్చు అని ఊహిస్తోంది.

వైసీపీలో నంబర్ టూ గా ఉంటూ ఢిల్లీకి ఎంతో సన్నిహితంగా ఉంటే ఎంపీ విజయసాయిరెడ్డి ఈ విషయాన్ని వెల్లడించడం విశేషం. విశాఖలో జరిగిన మీడియా మీట్ లో విజయసాయిరెడ్డి మధ్యంతర ఎన్నికల మీద సంచలన కామెంట్స్ చేశారు మధ్యంతర ఎన్నికలు వస్తాయని ఆయన జోస్యం చెప్పారు.

అయితే ఆయన పార్లమెంట్ సంగతి చెప్పడం లేదు. ఆంధ్రాకు అని అంటున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం పూర్తి మెజారిటీతో ఉంది. 164 సీట్లు సాధించింది. మధ్యంతర ఎన్నికలు ఎలా వస్తాయన్నది చూడాలి. అయితే విజయసాయిరెడ్డి చెబుతున్న దాని ప్రకారం చూస్తే పార్లమెంట్ కి రావచ్చు అని అనుకోవాల్సి ఉంటుంది.

అలా వచ్చినపుడు ఏపీలో ఎంపీ సీట్లు మొత్తం గెలుస్తామని ఆయన చెబుతున్నట్లుగా ఉంది. ఇక ఏపీకి మధ్యంతర ఎన్నికలు వచ్చినా లేక అయిదేళ్ల తరువాత ఎన్నికలు వచ్చినా కూడా గెలిచేది వైసీపీయే అని విజయసాయిరెడ్డి అంటున్నారు.

తాము విపక్షంలో ఉన్నా పోరాటాలు ఆపమని కూడా చెబుతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే మధ్యంతర ఎన్నికలు అని ఒక సీనియర్ మోస్ట్ లీడర్ నుంచి వచ్చిన ఈ వ్యాఖ్యలే చర్చకు తావిస్తున్నాయి. మధ్యంతర ఎన్నికలు అంటూ జరిగితే మరో చాన్స్ వైసీపీకి వస్తుంది. అవి పార్లమెంట్ కి అయినా కూడా ఇపుడున్న నాలుగు ఎంపీలను మరింతంగా పెంచుకున్నా వైసీపీ ఫ్యూచర్ బ్రైట్ గా ఉంటుంది. బహుశా అలాంటి అంచనాలతో విజయసాయిరెడ్డి చెప్పి ఉంటారు అని అంటున్నారు.

అక్కడే ఇండియా కూటమి నేతలు చేస్తున్న జోస్యాలతో విజయసాయిరెడ్డి మాటలను కలిపి చర్చించుకోవాల్సి వస్తోంది. కేంద్రంలో చూస్తే బొటా బొటీ మెజారిటీతో మోడీ ప్రభుత్వం ఉంది. ఎటు నుంచి ఏమి జరిగినా ఎవరు అలిగినా ప్రభుత్వానికి ంప్పుప్ తప్పది. అలాంటి పర్స్థితుల నేపధ్యంలో మోడీ ప్రభుత్వం దిగిపోతూ ఇండియా కూటమికి చాన్స్ ఇవ్వదని మధ్యంతరానికే అది దారి తీయవచ్చు అని అంటున్నారు. ఏపీలో మాత్రం మధ్యంతర ఎన్నికలు ఎట్టి పరిస్థితులలో జరగవు అని చెప్పవచ్చు.

అయితే మరో అయిదేళ్ళలో ఏపీలో ఎన్నికలు జరిగినా వైసీపీ గెలిచి తీరుతుందని విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా మధ్యంతరం అన్న మాట మాత్రం ఏపీలో రాజకీయ కకలకలమే రేపుతోంది అని చెప్పాలి.