జనసేన కార్పొరేటర్ 'పిల్' వ్యవహారం... సాయిరెడ్డి కుమార్తెకు బిగ్ షాక్!
ఈ నేపథ్యంలో... ఓ (అక్రమ) కట్టడం కూల్చివేత విషయంలో విజయసాయిరెడ్డి కుమార్తెకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
By: Tupaki Desk | 30 July 2024 7:37 AM GMTఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత... గత ప్రభుత్వంలో జరిగిన కార్యక్రమాలపై వైసీపీకి ఎదురుదెబ్బలు తగడం తప్పడం లేదని అంటున్నారు. ప్రధానంగా కూటమి ప్రభుత్వం... ఓ వైపు పరిపాలనపై దృష్టిపెడుతూనే, మరో వైపు గత ప్రభుత్వంలో జరిగిన పలు వ్యవహారాలపై సీరియస్ గా దృష్టిసారించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో... ఓ (అక్రమ) కట్టడం కూల్చివేత విషయంలో విజయసాయిరెడ్డి కుమార్తెకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
అవును... ఏపీకి కాబోయే రాజధానిగా వైసీపీ ప్రచారం చేసిన విశాఖపట్నంలో తాము నిర్మించిన కట్టడాన్ని అధికారులు కూల్చివేయకుండా స్టే ఇవ్వాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ సందర్భంగా స్పందించిన న్యాయస్థానం... ఈ దశలో మద్యంతర ఉతర్వులు ఇవ్వలేమని తేల్చి చెబుతూ... ఆమె అభ్యర్థనను తోసి పుచ్చింది!
వివరాళ్లోకి వెళ్తే... భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీ.ఆర్.జెడ్) నిబంధనలను ఉల్లంఘించి శాశ్వత నిర్మాణాలు చేపట్టాడాన్ని సవాల్ చేస్తూ.. విశాఖ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ సీజే ధర్మాసనం ముందు గతంలో పిల్ దాఖలు చేశారు. దీంతో... ఈ పిల్ పై విచారణ జరిపిన కోర్టు... ఈ నిర్మాణం పనులను తక్షణం నిలిపివేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదే సమయంలో అక్కడున్న యంత్రాలను సైతం వెంటనే సీజ్ చెయాలని.. కట్టడాల విషయంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులనే ఆదేశించింది. దీంతో... గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సహాయ సిటీ ప్లానర్ ఈ నెల 18న తుది ఉత్తర్వులు జారీ చేశారు. అయితే... వీటిని సవాల్ చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జ్ వద్ద పిటిషన్ వేశారు నేహారెడ్డి.
దీంతో... ఈ వ్యాజ్యాన్ని ఇదే వ్యవహారంతో ముడిపడి ఉన్న సీజే బెంచ్ వద్ద ఉన్న పిల్ తో జతచేయాలని సింగిల్ జడ్జి.. రిజిస్ట్రీని ఆదేశించారు. దీంతో... మూర్తి యాదవ్ దాఖలు చేసిన పిల్ తో పాటు నేహారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై సీజే బెంచ్ విచారణ జరిపింది. ఇదే సమయంలో... నేహారెడ్డి పిటిషన్ ను సింగిల్ జడ్జి విచారించడమే సబబని అభిప్రాయపడింది.
దీంతో... హైకోర్టు జడ్జి జస్టిస్ కృష్ణమోహన్ దీనిపై నేడు విచారణ జరిపారు. ఈ నేపథ్యంలోనే... నేహారెడ్డి చేసిన అభ్యర్థనను తోసి పుచ్చారు. ఆ నిర్మాణాలను నిలుపుదల చేస్తూ, అక్రమ కట్టడాలపై చట్టప్రకారం చర్యలు తీసుకొవలని సీజే నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులు అమల్లో ఉన్నంతకాలం తాము మద్యంతర ఉత్తర్వులు జారీ చేయడం సాధ్యం కాదంటూ స్పష్టం చేశారు సింగిల్ జడ్జి!