రాములమ్మ తెచ్చే ఓట్ల లెక్కెంత? టీ-కాంగ్రెస్ గుసగుస
అయితే, ఆమె అలా చేరారో లేదో.. వెంటనే ఆమెకు కాంగ్రెస్ ప్రచార, ప్లానింగ్ కమిటీ చీఫ్ కోఆర్డినేటర్‌గా కాంగ్రెస్ అధిష్టానం బాధ్యతలు అప్పగించింది.
By: Tupaki Desk | 18 Nov 2023 9:37 AM GMTబీజేపీ నుంచి తాజాగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న విజయశాంతి.. ఉరఫ్ రాములమ్మకు.. పార్టీ వెంట నే కీలక పదవి అప్పగించింది. బీజేపీలో ప్రాధాన్యం దక్కకపోవడం, టికెట్ కూడా లభించకపోవడంతో రాం రాం చెప్పిన రాములమ్మ.. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొన్నారు. అయితే.. ఆమెకు కాంగ్రెస్ పార్టీ కొత్తకాదు. గతంలోనూ ఈ పార్టీలో చేరి.. తర్వాత బయటకు వచ్చారు
అయితే, ఆమె అలా చేరారో లేదో.. వెంటనే ఆమెకు కాంగ్రెస్ ప్రచార, ప్లానింగ్ కమిటీ చీఫ్ కోఆర్డినేటర్‌గా కాంగ్రెస్ అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. కన్వీనర్లుగా సమరసింహారెడ్డి, పుష్పలీల, మల్లు రవి, కోదండరెడ్డి, నరేందర్‌రెడ్డి, యరపతి అనిల్, రాములు నాయక్, పిట్ల నాగేశ్వరరావు, ఒబేదుల్లా కొత్వాల్, రమేష్, పారిజాతరెడ్డి, సిద్దేశ్వర్, రామ్మూర్తి నాయక్, అలీ బిన్ ఇబ్రహీం, దీపక్ జాన్‌తో కలిసి ఆమె పనిచే యాల్సి ఉంటుంది.
అయితే.. పదవి దక్కింది సరే.. కానీ, రాములమ్మ తెచ్చే ఓట్ల లెక్కెంత? అనేది ఇప్పుడు అందరినీ ఆలో చింపజేస్తున్న విషయం. ఎందుకంటే.. ఆమె ఔనన్నా కాదన్నా.. ఆమెపై విఫలమైన నాయకురాలిగా ఒక ముద్ర పడిపోయింది. దీంతో ఆమె ప్రచార ఆర్భాటానికి వెళ్లినా.. ఎంత వరకు.. పార్టీకి ఓట్లు తీసుకురాగల రు? అనేది ప్రశ్న. మరోవైపు.. గత ఓటములు కూడా రాములమ్మకు మైనస్‌గా మారాయి. కలుపుగోలు తనం లేకపోవడం.. ఆధిపత్య ధోరణి వంటివి ఆమెను పార్టీలకు దూరంగా ఉంచాయి.
ఈ పరిణామాలతోనే గతంలో బీఆర్ ఎస్ నుంచి బయటకు వచ్చారు. తర్వాత బీజేపీ నుంచి కూడా రాక తప్పలేదు. ఇక, బయటకు వచ్చి మళ్లీ చేరిన కాంగ్రెస్‌లోనూ ఇదే ముద్ర ఉంది. మెజారిటీ నాయకులు రాములమ్మ చేరికపై మౌనం వహించారు. సో.. దీనిని బట్టి.. రాములమ్మ ప్రస్తుత ఎన్నికల్లో ఏమేరకు పార్టీకి ప్లస్ అవుతారు? అనేది చూడాల్సి ఉంది. ఏదేమైనా.. ఇక్కడ కూడా విఫలమైతే.. రాములమ్మ ఇంటికే పరిమితం కాకతప్పదనే వాదన వినిపిస్తోంది