Begin typing your search above and press return to search.

ఊహాగాణాలకు ఇచ్చిపడేసిన రాములమ్మ... ఒక్క ట్వీట్ తో క్లారిటీ!

కేసీఆర్ ఢిల్లీ టూర్ రహస్యాలంటూ మోడీ చేసిన సంచలన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించిన విషయంపై కౌంటర్ ఇచ్చారు. తనదైన శైలిలో పలు ఘాటు వ్యాఖ్యలే చేశారు.

By:  Tupaki Desk   |   4 Oct 2023 4:22 AM GMT
ఊహాగాణాలకు ఇచ్చిపడేసిన రాములమ్మ... ఒక్క ట్వీట్ తో క్లారిటీ!
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో మోడీ సందడి కంటిన్యూ అవుతుంది. పైగా కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం దక్షిణాదిలో బీజేపీకి దారులు మూసుకుపోతున్నాయనే కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో తెలంగాణపై మరింత శ్రద్ధ పెట్టింది బీజేపీ. ఈ నేపథ్యంలో కాస్తో కూస్తో హోప్ ఉన్న తెలంగాణలో కచ్చితంగా జెండా పాతాలని బలంగా భావిస్తుంది.

ఇందులో భాగంగా ప్రధాని మోడీ నాడు కర్ణాటక రాష్ట్రంలో ఎలా వరుస పర్యటనలు చేపట్టారో కాస్త అటు ఇటుగా అదే పనిలో ఉన్నారు మోడీ. ఈ క్రమంలో మూడు రోజుల గ్యాప్‌ లో తెలంగాణలో రెండు సార్లు పర్యటించారు. ఇందులో భాగంగా అక్టోబర్ 1న పాలమూరులో పర్యటించగా.. అక్టోబర్ 3న ఇందూరులో పర్యటించారు.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ మోడీ చెపట్టిన ఈ వరుస పర్యటనలు, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలతో బీజేపీ తెలంగాణ ఎన్నికల ప్రచార శంఖరావాన్ని పూరించినట్లే శ్రేణులు భావిస్తున్నాయి. ఈ భావనకు బలం చేకూర్చేలాగానే మోడీ ప్రసంగాలు కూడా ఉన్నాయి. ఐతే ఈ సభలకు రాములమ్మ మాత్రం డుమ్మా కొట్టడం ఆసక్తిగా మారింది.

అవును... గతకొన్ని రోజులుగా బీజేపీ అధిష్టాణంపై గుర్రుగా ఉన్నట్లు కనిపిస్తోన్న విజయశాంతి... కిరణ్ కుమార్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడంపై అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్న విజయశాంతి.. త్వరలో కాంగ్రెస్ లో చేరిపోతున్నారని చెబుతున్న విజయశాంతి తాజాగా స్పందించారు. పార్టీపై అసంతృప్తి, జంపింగ్ వంటి కామెంట్లన్నింటికీ ఒకేసారి సమాధానం ఇచ్చే పనికి పూనుకున్నారు.

ఇందులో భాగంగా... పాలమూరులో జరిగిన సభ గురించి ఏమాత్రం స్పందించని విజయశాంతి.. ఇందూరు సభపై మాత్రం ట్విట్టర్ వేదికగా స్పందించారు. కేసీఆర్ ఢిల్లీ టూర్ రహస్యాలంటూ మోడీ చేసిన సంచలన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించిన విషయంపై కౌంటర్ ఇచ్చారు. తనదైన శైలిలో పలు ఘాటు వ్యాఖ్యలే చేశారు.

ప్రధాని మోడీ చెప్పినట్లుగా ఎండీఏలో చేరుతామని కేసీఆర్ అడిగి ఉండవచ్చని విజయశాంతి తెలిపారు. అందులో నిజం తప్పక ఉండి ఉంటుంది అని మొదలుపెట్టిన విజయశాంతి... 2009లో కూడా తెలంగాణాలో మహాకూటమి పేరిట కమ్యూనిష్టులతో కలిసి పోటీ చేసిన కేసీఆర్.. కౌంటింగ్ డబ్బాలు తెరువక ముందే లూధియానాలో జరిగిన ఎన్డీయే ర్యాలీకి హాజరైన వాస్తవం ప్రజలకు ఇంకా జ్ఞాపకముందని గుర్తుచేసుకున్నారు.

ఇదే సమయంలో... కేటీఆర్ ఈ విషయంలో మోడీని తిట్టటం అవసరం కాదు... అసమంజసం కూడా...! అంటూ తనదైన శైలిలో స్పందించారు విజయశాంతి. ఇదే సమయంలో ఇందులో వాస్తవం ఉండి ఉండొచ్చు కాబట్టి కేటీఆర్ ఈ విషయంలో మోడీని తిట్టటం అనవసరం అంటూ హితవు పలికారు రాములమ్మ.

దీంతో.. ఆ ఒక్క ట్వీట్ తో... ఆమెపై వస్తున్న ఊహాగానాలన్నింటికి ఒక్కసారిగా చెక్ పడ్డటయ్యింది. అయితే.. గతంలోనూ పార్టీ మార్పుపై వస్తోన్న ఊహాగాణాలపై పలుమార్లు స్పందించిన విజయశాంతి.. తాను పార్టీ మారట్లేదని కుండబద్దలు కొట్టారు. ఇదే సమయంలో అలాంటి వార్తలు ప్రచారం చేస్తున్న వారిపై ఆసహనం వ్యక్తం చేశారు.

కాగా గతకొన్ని రోజులుగా విజయశాంతి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం, ఆఖరికి తెలంగాణలో మోడీ సభలకు కూడా హాజరుకాకపోవడంపై రకరకాల కామెంట్లు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. విజయశాంతి పార్టీ మారుతున్నారని, ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని కామెంట్లు వినిపించాయి. అయితే ఒక్క ట్వీట్ తో వాటన్నింటికీ రాములమ్మ చెక్ పెట్టారని అంటున్నారు పరిశీలకులు.