రాములమ్మ డిసైడ్ అయ్యారా ?
ఇంతకీ రాములమ్మకు కామారెడ్డి నియోజకవర్గంలో పోటీచేయాలని అంత పట్టుదల ఎందుకు ?
By: Tupaki Desk | 25 Aug 2023 9:11 AM GMTరాములమ్మగా పాపులరైన విజయశాంతి డిసైడ్ అయిపోయారట. ఏ విషయంలో అంటే రాబోయే ఎన్నికల్లో పోటీచేసే విషయంలో. రాబోయే ఎన్నికల్లో తాను కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీచేయటానికి రెడీగా ఉన్నట్లు పార్టీ అగ్రనేతలకు ఆమె ఒక లేఖ రాశారట. గెలుపోటములతో సంబంధంలేకుండా కామారెడ్డిలో పోటీచేసే అవకాశం తనకే ఇప్పంచాలని రాములమ్మ లేఖలో కోరారు. ఇంతకీ రాములమ్మకు కామారెడ్డి నియోజకవర్గంలో పోటీచేయాలని అంత పట్టుదల ఎందుకు ?
ఎందుకంటే అక్కడ పోటీచేస్తున్నది కేసీయార్ కాబట్టే. రాబోయే ఎన్నికల్లో కేసీయార్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నారు. మొదటినుండి పోటీచేస్తున్న గజ్వేలు నియోజకవర్గంతో పాటు అదనంగా నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డిలో కూడా పోటీచేయబోతున్నట్లు స్వయంగా కేసీయారే ప్రకటించారు. దాంతో కేసీయార్ పై గజ్వేలులో పోటీచేయబోయేది ఎవరు ? కామారెడ్డిలో పోటీచేయబోయేది ఎవరనేది సస్పెన్సుగా మారింది.
కాంగ్రెస్ తరపున అయితే మాజీమంత్రి షబ్బీర్ ఆలీ పోటీచేయబోతున్నారు. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా షబ్బీరే కామారెడ్డిలో పోటీచేస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీ తరపున ఎవరు పోటీచేస్తారని ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకంటే అసలు బీజేపీకి ఉన్న బలం ఏమిటో అందరికీ తెలిసిందే కాబట్టి. కానీ ఇపుడు మాత్రం బీజేపీ పైన కూడా అందరి దృష్టిపడింది. ఈ నేపధ్యంలోనే రాములమ్మ అగ్రనేతలక టికెట్ కోసం రిక్వుస్టు చేసుకోవటం ఆసక్తిగా మారింది. కామారెడ్డిలో పోటీచేయటానికి సిద్ధంగా ఉన్నట్లు ట్వీట్ కూడా చేశారు.
నిజానికి విజయశాంతి చాలాకాలంగా పార్టీలో యాక్టివ్ గా లేరు. ఎందుకంటే తనకు పార్టీ ప్రాధాన్యత ఇవ్వటంలేదన్న అసంతృప్తితో ఉన్నారు. ఈ విషయాన్ని మీడియా ముందే వ్యక్తంచేశారు కూడా. అందుకనే అగ్రనేతలతో కూడా అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. ఇలాంటి సమయంలో అసెంబ్లీ ఎన్నికలు వస్తుండటం, కామారెడ్డిలో కేసీయార్ పోటీకి దిగుతుండటాన్ని రాములమ్మ అడ్వాంటేజ్ గా తీసుకోవాలని అనుకున్నారేమో. కేసీయార్ కు వ్యతిరేకంగా పోటీచేయాలంటే గట్టి అభ్యర్ధి లేకపోతే కష్టం. గెలుపును పక్కన పెట్టేసినా అసలు పోటీ ఇవ్వాలంటే కూడా ఒక స్ధాయి ఉన్న నేత కావాలి. అందుకనే విజయశాంతి పోటీకి రెడీ అవుతున్నట్లున్నారు.