విజయవాడ మునిగింది.. వెల్లంపల్లి ఎక్కడ
ఇప్పుడు వరదలో చిక్కుకున్నారు. మరి వారిని కాపాడేందుకు ఆయన కనీసం ముందుకు వచ్చారా? ఇవీ ఇప్పుడు తెరమీదికి వచ్చిన ప్రశ్నలు.,
By: Tupaki Desk | 8 Sep 2024 5:30 AM GMTవిజయవాడ మునిగిపోయింది. మరి విజయవాడకే చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, వ్యాపార వేత్త వెల్లంపల్లి శ్రీనివాసరావు ఏం చేస్తున్నారు? ముఖ్యంగా 2009, 2019లో ఆయనకు ఓట్లేసి గెలిపించిన వన్ టౌన్ వాసులు ఇప్పుడు వరదలో చిక్కుకున్నారు. మరి వారిని కాపాడేందుకు ఆయన కనీసం ముందుకు వచ్చారా? ఇవీ ఇప్పుడు తెరమీదికి వచ్చిన ప్రశ్నలు.,
ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన అసలు విజయవాడలోనే లేరని ఆయన అనుచరులు చెబుతున్నారు. మరికొందరు.. జగన్ నుంచి ఎలాంటి ఆదేశాలూ రాలేదని.. వస్తే సాయం చేసేవారని అంటున్నారు. ఏదేమైనా వెల్లంపల్లి ఇప్పుడు విజయవాడలో అయితే కనిపించడం లేదు. ముఖ్యంగా ఆయన సాయం కోసం వ్యాపార వర్గాలు ఎదురు చూస్తున్నాయి.
వరదలు, వర్షాలు కురిసి ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే.. నాయకులు ముందుకు రావాలి. అదేంటో వెల్లంప ల్లి జోష్ ఎక్కడా కనిపించడం లేదు. ఇటీవల జగన్ కృష్ణలంకలో పర్యటించినప్పుడు మాత్రం శ్రీనివాసరా వు అలా కనిపించి.. ఇలా మాయమయ్యారు. తర్వాత ఇంకెక్కడా కనిపించడం లేదు. సొంత నియోజకవ ర్గం పశ్చిమలోని వించిపేట వాసులు అల్లాడిపోతున్నారు. ఇక, కేబీఎన్ కాలేజీ, కొత్తపేట పూర్తిగా జలదిగ్బంధంలో ఉన్నాయి.
అయినప్పటికీ.. వెల్లంపల్లి కనిపించకపోవడం గమనార్హం. ఇక్కడ వైసీపీ కార్యకర్తల కుటుంబాలే ఎక్కువ గా ఉన్నాయి. కొండ ప్రాంతాల్లో బండరాళ్లు దొర్లి పడుతున్నాయని అక్కడి వారంతా తలోదిక్కుకు వెళ్లిపో యారు. వారి నుంచి ఫోన్లు వస్తున్నా.. వెల్లంపల్లి మాత్రం కనిపించడం లేదు. ఇక, కీలకమైన వస్త్రలత ప్రాంతం కూడా ముంపులోనే ఉంది. ఇంత జరుగుతున్నా.. వెల్లంపల్లి ఎంజాయ్ చేస్తున్నారా? తమకు కనీసం అండగా నిలబడరా? అనే టాక్ వినిపిస్తుండడం గమనార్హం.