Begin typing your search above and press return to search.

7+6+9+1 = 23... విజయసాయిరెడ్డి విశ్లేషణ వైరల్!

ట్విట్టర్ వేదికగా చంద్రబాబు & కో సెటైర్లతో వెంటాడే సాయిరెడ్డి... ఖైదీ నెంబర్ పై కూడా తనదైన పంచ్ వేశారు.

By:  Tupaki Desk   |   11 Sep 2023 8:33 AM GMT
7+6+9+1 = 23... విజయసాయిరెడ్డి  విశ్లేషణ  వైరల్!
X

ఏపీ రాజకీయాల్లో "23" నెంబర్ చాలా ప్రత్యేకమైనదనేది తెలిసిన విషయమే. రాష్ట్రవిభజన అనంతరం జరిగిన 2014 ఎన్నికల ఫలితాల తర్వాత ఆపరేషన్ ఆకర్ష స్టార్ట్ చేశారు చంద్రబాబు! ఇందులో భాగంగా వైసీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను కండువాలు కప్పి టీడీపీలో చేర్చుకున్నారు. ఇది అప్రజాస్వామిక చర్య అని అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి.

కట్ చేస్తే... 2019 ఎన్నికలు సమీపించాయి. ఆ ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు రాగా, టీడీపీ 175 స్థానాలకు గానూ 23 స్థానాలు గెలుచుకుంది. దీంతో ఈ విషయాన్ని ప్రస్థావిస్తూ... చేసుకున్నోడికి చేసుకున్నంత మహదేవా అంటూ వైసీపీ నేతలు ర్యాగింగ్ చేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి ఆ "23" నెంబర్ చర్చనీయాంశం అయ్యింది.

అవును... స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో బాబుని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. అనంతరం ఆ సెంట్రల్ జైలులోని స్కేహ బ్లాక్ లో ఒక ప్రత్యేక గదిని కేటాయించారు. ఈ సమయంలో బాబుకు ఖైదీ నెంబర్ 7691 కేటాయించారు జైలు అధికారులు.

సరిగ్గా ఈ సమయంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందించారు. ట్విట్టర్ వేదికగా చంద్రబాబు & కో సెటైర్లతో వెంటాడే సాయిరెడ్డి... ఖైదీ నెంబర్ పై కూడా తనదైన పంచ్ వేశారు. ఇందులో భాగంగా... బాబుకు కేటాయించిన ఖైదీ నెంబర్ 7691 లోని ప్రతీ అంకెనీ కలుపుతూ... 7+6+9+1 = 23 అని ట్వీట్ చేశారు. దీంతో "23" నెంబర్ మళ్లీ వైరల్ అవుతుంది.

"చంద్రబాబు ఖైదీ నెంబర్ 7691. 7+6+9+1 = 23. చంద్రబాబు గారూ... మీకు 2023 చివరి సంవత్సరం. 24 నుంచి రాజకీయ యవనికపై ఇక కనిపించరు. మీ మామగారు ఎంత మనోవేదన చెందారో ఇప్పుడు అర్ధం అయ్యుంటుంది మీకు" అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది.

కాగా... ఒకానొక సమయంలో కాస్త సైలంటుగా ఉన్నట్లు కనిపించిన సాయిరెడ్డి ఈ మధ్యకాలంలో ఆన్ లైన్ వేదికగా మళ్లీ పొలిటికల్ హంట్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా చంద్రబాబును ర్యాగింగ్ చేయడంలో ఈయనది అందెవేసిన చెయ్యి అన్నట్లుగా ఉంటుంది వ్యవహారం అని అంటుంటారు.