Begin typing your search above and press return to search.

పామునైనా నమ్ముతారు కానీ... కాంగ్రెస్ పై సాయిరెడ్డి ఫైర్!

ఈ క్రమంలో తాజాగా టీపీసీసీ చీఫ్ గా షర్మిల బాధ్యతలు తీసుకుంటున్న వేళ... వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   21 Jan 2024 6:17 AM GMT
పామునైనా నమ్ముతారు కానీ...  కాంగ్రెస్  పై సాయిరెడ్డి ఫైర్!
X

ఏపీలో అధికార వైసీపీకి ఇప్పుడు మరో ప్రత్యర్థి పార్టీ రెడీ అయ్యింది. నిన్నటివరకూ టీడీపీ, జనసేనలపై విరుచుకుపడిన వైసీపీ నేతలు.. ఇప్పుడు కాంగ్రెస్ పైనా అదేస్థాయిలో ఫైరవుతున్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహాన్ని గుర్తుచేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా టీపీసీసీ చీఫ్ గా షర్మిల బాధ్యతలు తీసుకుంటున్న వేళ... వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో గెలవడంతో ఏపీలోనూ పూర్వవైభవం తెచ్చుకోవాలని కాంగ్రెస్స్ పార్టీ ఉవ్విళ్లూరుతుంది. ఇందులో భాగంగా ఏపీలో అంపశయ్యపై ఉన్న పార్టీని లేచి నిలబెట్టి, పరుగెత్తించే బాధ్యతను వైఎస్ షర్మిళకు అప్పగించింది. దీంతో... తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని చెప్పిన షర్మిళ... ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో విభజిత ఆంధ్రప్రదేశ్ కు కాంగ్రెస్స్ పార్టీ చేసిన ద్రోహాన్ని, అన్యాయాన్ని గుర్తుచేస్తూ విజయసాయిరెడ్డి ఫైరయ్యారు. గతం గుర్తుచేస్తూ కాంగ్రెస్స్ ను కడిగిపారేశారు. ఇందులో భాగంగా... 2004, 2009లో కేంద్రంలో కాంగ్రెస్ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు కావడం వెనుక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అత్యంత కీలకంగా వ్యవహరించిందని సాయిరెడ్డి గుర్తు చేశారు.

దీంతో... అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ సాధించిన లోక్‌ సభ స్థానాల గురించి పరోక్షంగా ప్రస్థావించారు. అయితే... అటువంటి పరిస్థితి ఇప్పుడు లేదని నొక్కి వక్కానించిన విజయ సాయిరెడ్డి.. విభజిత ఆంధ్రప్రదేశ్ కు కాంగ్రెస్స్ పార్టీ చేసిన ద్రోహాలను మరోసారి తెరపైకి తెచ్చే ప్రయత్నం చేశారు.

అయితే... రెండు సార్లు కేంద్రంలో అధికారంలోకి రావడానికి సహకరించిన, కాంగ్రెస్ పార్టీకి ఏపీ చేసిన మేలును గుర్తుంచుకోకుండా.. ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసుకుందని సాయిరెడ్డి ఫైరయ్యారు. ఈ సందర్భంగా... రాష్ట్ర విభజన సమయంలో విభజిత ఆంధ్రప్రదేశ్ డిమాండ్లు, అవసరాలను ఆ పార్టీ ఏనాడూ పట్టించుకోలేదని దుయ్యబట్టారు.

ఈ సందర్భంగా ఆన్ లైన్ వేదికగా స్పందించిన ఆయన... "2004 & 2009లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఏపీ కీలక పాత్ర పోషించింది. అయితే, తిరిగి ఇవ్వాల్సిన సమయం వచ్చినప్పుడు, ఏపీ అవసరాలను కాంగ్రెస్ పట్టించుకోలేదు. దీంతో... ఏపీ ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారు. ఏపీ ప్రజలు పామును అయినా నమ్ముతారు కానీ కాంగ్రెస్‌ ని నమ్మరు" అని స్పష్టం చేశారు.