హేమమాలినిపైకి బాక్సర్ ని వదిలిన కాంగ్రెస్... హాట్ టాపిక్ గా హ్యాట్రిక్!
ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్ లోని మధుర నియోజకవర్గంలో ప్రముఖ నటి హేమ మాలినిపై స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ ని పోటీకి దింపింది.
By: Tupaki Desk | 31 March 2024 4:04 AM GMTరానున్న లోక్ సభ ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవాలని కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకున్న సంగతి తెలిసిందే. మరోపక్క ఈసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అభ్యర్థుల ఎంపికలో అనూహ్య పథకాలు రచిస్తుంది. ఇందులో భాగంగా హేమామాలిని పైకి బాక్సర్ ని రెడీ చేసింది. దీంతో ఈ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది.
అవును... ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సరికొత్త ప్రయోగాలు చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్ లోని మధుర నియోజకవర్గంలో ప్రముఖ నటి హేమ మాలినిపై స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ ని పోటీకి దింపింది. మధుర లోక్ సభ నియోజకవర్గానికి తమ అభ్యర్థిగా హేమమాలినిని బీజేపీ బరిలోకి దించగా.. విజేందర్ కు టిక్కెట్ ఇచ్చింది కాంగ్రెస్.
ఏప్రిల్ 26న ఇక్కడ పోలింగ్ జరగనుండగా... జూన్ 4న ఫలితాలు వెలూడనున్నాయి. ఇక... ఈసారి యూపీలోని సమాజ్ వాదీ పార్టీతో కలిసి కాంగ్రెస్ బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఈ స్థానం నుంచి ఇప్పటికే హేమా మాలిని వరుసగా రెండు సార్లు విజయం సాధించారు. ఇందులో భాగంగా... 2014లో ఆర్.ఎల్.డీ జాతీయ అధ్యక్షుడు జయంత్ చౌదరిపై హేమా మాలిని.. మూడు లక్షల ఓట్లతో గెలుపొందారు.
ఇక గత ఎన్నికల్లో అదే పార్టీకి చెందిన కువర్ నరేంద్ర సింగ్ పైనా 2 లక్షల 93 వేల మెజారిటీతో గెలుపొందారు. రానున్న ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ సాధించాలని ఉవ్విళ్లూరుతున్నారని అంటున్నారు. ఈ ఎన్నికల్లో ఆ నియోజకవర్గం నుంచి బీఎస్పీ తరుపున కమల్ కంత్ ఉపమన్యు పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ నుంచి విజేందర్ సింగ్ బరిలోకి దిగనున్నారు.
కాగా... విజేందర్ సింగ్ కూడా గతంలో ఢిల్లీ నుంచి పోటీ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా దక్షిణ ఢిల్లీ స్థానానికి కాంగ్రెస్ నుంచి పోటీచేసి.. బీజేపీ అభ్యర్థి రమేష్ బిధూరి చేతిలో ఓటమి పలయ్యారు. మరి ఈసారి యూపీలో విజేందర్ ఎలాంటి పెర్ఫార్మెన్స్ చేస్తారనేది వేచి చూడాలి!