Begin typing your search above and press return to search.

నిర్మలమ్మ పర్యటనకు రూ.4,230 ఖర్చు... పురందేశ్వరికి సర్పంచ్ రిక్వస్ట్!

గత ఐదేళ్లుగా ఇదే తంతు జరిగిందని.. దాదాపు ఏపీలోని ప్రతీ గ్రామ సర్పంచ్ పరిస్థితి ఇలానే ఉందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   30 Aug 2024 6:49 AM GMT
నిర్మలమ్మ పర్యటనకు రూ.4,230 ఖర్చు... పురందేశ్వరికి సర్పంచ్  రిక్వస్ట్!
X

ఏపీలో గత ప్రభుత్వ హయాంలో సర్పంచుల పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైందని.. గ్రామ పంచాయతీలకు నిధులు లేక, కొంతమంది సర్పంచులు అప్పులు చేసి మరీ కొన్ని చిన్న చిన్న పనులు చేయాల్సిన పరిస్థితి అని.. వాటికి సంబంధించిన బిల్లులు ఇప్పటికీ రాకపోవడంతో వడ్డీలు పెరిగిపోతున్నానే కామెంట్లు వినిపిస్తున్నాయి.

గత ఐదేళ్లుగా ఇదే తంతు జరిగిందని.. దాదాపు ఏపీలోని ప్రతీ గ్రామ సర్పంచ్ పరిస్థితి ఇలానే ఉందని అంటున్నారు. ఓ దశలో ఈ విషయంపై తీవ్ర నిరసనలూ తెరపైకి వచ్చాయి. ఈ సమయంలో నాడు సర్పంచుల పరిస్థితి ఎలా ఉండేది అనడానికి సంబంధించిన ఓ తాజా ఉదాహరణ తెరపైకి వచ్చింది. ఈ మేరకు గతంలో ఖర్చు చేసిన రూ.4,230 రూపాయలు ఇప్పించాలని ఎంపీకి రిక్వస్ట్ వచ్చింది.

అవును... గతంలో కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మాళా సీతారామన్ తమ ప్రాంతంలో పర్యటించారని.. ఆ సమయంలో ప్రోటోకాల్ కోసం అని రూ.4,230 ఖర్చు చేశానని.. అయితే ఆ మొత్తం తిరిగి ప్రభుత్వం చెల్లించలేదని.. పైగా అది తాను అప్పుచేసి తెచ్చిన సొమ్మని.. మరోపక్క దానికి సంబంధించిన వడ్డీలు పెరిగిపోతున్నాయని ఓ సర్పంచ్ ఫిర్యాదు చేయడం ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది!

వివరాళ్లోకి వెళ్తే... వీజయవాడ సమీపంలోని గొల్లపూడి మండలం, రాయనపాడు గ్రామానికి చెందిన సర్పంచ్ కాటమనేని కల్యాణి.. ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరికి ఓ ఫిర్యాదు చేశారు. ఇందులో భాగంగా తమ గ్రామంలో నిర్వహించిన వికసిత్ భారత్ సభలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారని.. ఆ సమయంలో ప్రోటోకాల్ ఖర్చులు ఆనాటి ప్రభుత్వం చెల్లించలేదని ఫిర్యాదులో పాల్గొన్నారు.

2023 డిసెంబర్ 9న జరిగిన ఈ సభలో నాటి కలెక్టర్ ఆదేశాల మేరకు రూ.4,230 అప్పు చేసి మరీ ఖర్చు చేశానని ఆమె తెలిపారు. అయితే... ఆ తర్వాత వైసీపీ సర్కార్ తనకు ఒక్క నయాపైసా కూడా చెల్లించలేదని.. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని తన సొమ్మును తనకు తిరిగి ఇప్పించాలని.. పైగా దానిపై వడ్డీలు కూడా పెరిగిపోతునాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

దీంతో... ఆమె ఫిర్యాదుపై వెంటనే స్పందించిన పురందేశ్వరి... కలెక్టర్ కు ఫోన్ చేశారు.. సర్పంచ్ కల్యాణి విన్నపాన్ని స్పెషల్ కేసుగా పరిగణించి సొమ్ములు అందజేయాలని కోరారు. దీనికి కలెక్టర్ సానుకూలంగా స్పందించారని అంటున్నారు. దీంతో... నాటి ప్రభుత్వ హయాంలో సర్పంచుల పరిస్థితికి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ అని అంటున్నారు నెటిజన్లు!