Begin typing your search above and press return to search.

ఒకటే ఊరు.. ధైర్య సాహసాలే అతడి తీరు

మహారాష్ట్రలోని మేల్ ఘాట్ ప్రాంతంలోని పిలీ గ్రామంలో ఒకే ఇల్లు ఉంది. ఇది అందరి చూపును ఆకర్షిస్తోంది. రిజర్వ్ ప్రాజెక్టులో భాగంగా ఇక్కడ ఉన్న 37 గ్రామాలకు పునరావాసం కల్పించాల్సి ఉంది.

By:  Tupaki Desk   |   13 Dec 2023 2:30 PM GMT
ఒకటే ఊరు.. ధైర్య సాహసాలే అతడి తీరు
X

మహారాష్ట్రలోని మేల్ ఘాట్ ప్రాంతంలోని పిలీ గ్రామంలో ఒకే ఇల్లు ఉంది. ఇది అందరి చూపును ఆకర్షిస్తోంది. రిజర్వ్ ప్రాజెక్టులో భాగంగా ఇక్కడ ఉన్న 37 గ్రామాలకు పునరావాసం కల్పించాల్సి ఉంది. ఇప్పటికే 17 గ్రామాలను తరలించి పునరావాసం కల్పించారు. మరో ఆరు గ్రామాలను తరలిస్తున్నారు. ఈనేపథ్యంలో పిలీ గ్రామంలో 500 కుటుంబాలు ఉండేవి. 2021లో వాటిని ఖాళీ చేయించారు.

అధికారులు బలవంతంగా ఖాళీ చేయించారు. అందరు వెళ్లిపోయినా ఒక కుటుంబం మాత్రం ఖాళీ చేయలేదు. భోగిలాల్ ఖాయిట్కర్ కుటుంబం ఆరుగురు అక్కడే ఉంటున్నారు. అతడికి అక్కడ 25 ఎకరాల వ్వవసాయ భూమి ఉంది. పెద్ద ఇల్లుతోపాటు 8 ఆవులు, 20 కోళ్లు ఉన్నాయి. వ్యవసాయం చేసుకుంటూ అక్కడే ఉంటున్నారు. తన ఇద్దరు పిల్లలను చదివించుకుంటున్నాడు.

పిల్లలను పాఠశాలకు తానే తీసుకువెళ్లి సమీప గ్రామంలోని పాఠశాలలో దించుతూ తీసుకొస్తుంటాడు. తన భూమికి సరసమైన ధర చెల్లిస్తే ఇక్కడ నుంచి వెళ్లడానికి తనకు అభ్యంతరం లేదు. కానీ నాకు ఎవరు కూడా అంత డబ్బు ఇవ్వడం లేదని చెబుతున్నాడు. ప్రభుత్వం అన్నింటికి కలిపి రూ. 10 లక్షలు ఇస్తే నాకు సరిపోదని స్పష్టం చేస్తున్నాడు.

ఇప్పుడు అక్కడ ఉన్న ఒకే ఇల్లు అందరికి ఆశ్చర్యం కలిగిస్తోంది. ఊరంతా ఖాళీ చేసినా అతడు మాత్రం అక్కడే ఉంటున్నాడు. తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. పిలీ గ్రామంలో నివాసం ఉంటున్న భోగిలాల్ ధైర్య సాహసానికి ముచ్చట పడుతున్నారు. అతడి కుటుంబంతో ఒక్కడే ఒంటరిగా అడవిలో ఉన్నట్లు గుర్తించి అచ్చెరువొందుతున్నారు.

ప్రస్తుతం అక్కడ అతడి ఇల్లు ఒక్కటే కనిపిస్తోంది. అందరు వెళ్లిపోయినా అతడు మాత్రం అక్కడే ఉంటున్నాడు. ఎంతమంది బెదిరించినా ధైర్యమే అతడి ఆయుధంగా చేసుకున్నాడు. ఎంతమంది చెప్పినా తనకు మంచి ధర వస్తే కానీ ఇక్కడ నుంచి వెళ్లేది లేదని భీష్మించుకు కూర్చున్నాడు. దీంతో అతడి ఇల్లు ఒక్కటే అక్కడ ఉండటంతో చాలా మంది అవాక్కవుతున్నారు.