Begin typing your search above and press return to search.

ప‌థ‌కాల మాట‌: విలేజ్ క్లినిక్కులు-ఇంటింటి డాక్ట‌ర్ సంగ‌తేంటి.. ?

రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన కీల‌క‌మైన పథకాలలో కొన్నింటిని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టింది.

By:  Tupaki Desk   |   26 July 2024 5:50 AM GMT
ప‌థ‌కాల మాట‌: విలేజ్ క్లినిక్కులు-ఇంటింటి డాక్ట‌ర్ సంగ‌తేంటి.. ?
X

రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన కీల‌క‌మైన పథకాలలో కొన్నింటిని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టింది. ఇప్పుడు మరో కీలకమైన పథకం కూడా బుట్ట దాఖ‌లు కానుందని తెలుస్తుంది. ఉదాహరణకు వైసీపీ హయంలో చివరి ఆరుమాసాల్లో విలేజ్ క్లినిక్లు, ఇంటి డాక్టర్ అనే కాన్సెప్ట్ ను జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. వాస్తవానికి ఇది 2019 ఎన్నికల మేనిఫెస్టోలో లేదు. అయినా కూడా ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థన‌లను ప‌రిశీల‌న‌లోకి తీసుకుని, అదేవిధంగా మన్యం ప్రాంతాల్లో తరచుగా ఎదురవుతున్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని వైద్యాన్ని ఇంటికే చేర్చాలి అన్న సంకల్పంతో వీటిని తీసుకువ‌చ్చారు.

ఇప్పటికే రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో విలేజ్ క్లినిక్ ల నిర్మాణం పూర్తయింది. మరికొన్ని జిల్లాల్లో టెండర్లు పిలిచారు. ఈలోపు ఎన్నికల హడావుడి మొదలైంది. దీంతో ఈ అంశం వాయిదా పడింది. తిరిగి తాము అధికారంలోకి వస్తే విలేజ్ క్లినిక్లను అద్భుతంగా తీర్చి దిద్దుతామని, ఇంటింటి డాక్టర్ ప‌థ‌కాన్ని అమలు చేస్తామని జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. అయితే ఆయన ప్రభుత్వం రాక‌పోగా, ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.

కీలకమైన ప్రజలకు మేలు చేసే పథకంగా ఉన్న విలేజ్ క్లినిక్‌ని ప్రస్తుత ప్రభుత్వం పక్కన పెట్టేసింది. ఈ విషయాన్ని వైద్య శాఖ మంత్రి స‌త్య‌కుమార్ యాదవ్ తర్వాత చూద్దాం అని వ్యాఖ్యానించడం ద్వారా విలేజి క్లినిక్ అంశం ఇక తెర‌మ‌రుగైన‌ట్టుగానే భావించాలి. వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు చాలా మృగ్యంగా మారాయి. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలు ప్రజలకు వైసీపీ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టండి. ఈ క్రమంలోనే విలేజ్ క్లినిక్ అనే నూతన కాన్సెప్ట్ తీసుకురావడం ద్వారా గ్రామీణ స్థాయిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలని భావించంది.

కానీ ఇది ఎన్నికలకు ముందు తీసుకున్న నిర్ణయం కావడంతో పూర్తిస్థాయిలో అడుగులు ముందుకు పడలేదు. పట్టణ స్థాయిలో ఇంటింటి డాక్టర్ కాన్సెప్ట్ కూడా వైసిపి ప్రభుత్వం చేయాలని భావించింది. అంటే వైద్యులే ఇంటికి వచ్చి ఆరోగ్య వివరాలను సేకరించడం, వ్యక్తుల ఆరోగ్యం పై దృష్టి పెట్టడం కీల‌కంగా మారింది. ప్రతి 50 ఇళ్లకు ఒక వైద్యుని నియమించడం వంటి ఒక బృహత్తర కార్యక్రమానికి జగన్ ప్రభుత్వ శ్రీకారం చుట్టింది. నిజానికి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న ఇట్లాంటి ప‌థ‌కాల విషయాల్లో ప్రస్తుత ప్రభుత్వం రాజ‌కీయ అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోకుండా అమ‌లు చేయాల‌నే అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.