Begin typing your search above and press return to search.

రెజ్లర్ పంచ్... తీవ్ర ఉత్కంఠ మధ్య వినేష్ ఫోగట్ ఘన విజయం!

ఈ క్రమంలో హరియాణాలో మూడోసారి బీజేపీ అధికారం చేపట్టే దిశగా అడుగులు వేస్తోంది.

By:  Tupaki Desk   |   8 Oct 2024 8:49 AM GMT
రెజ్లర్  పంచ్... తీవ్ర ఉత్కంఠ మధ్య వినేష్  ఫోగట్  ఘన విజయం!
X

అత్యంత రసవత్తరంగా హరియాణా ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఎగ్జిట్ పోల్ ఫలితాలకు భిన్నంగా హరియాణాలో బీజేపీ దూసుకుపోతోంది. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన అనంతరం ఫలితాలు కాంగ్రెస్ కు అనుకూలంగా వచ్చినట్లు కనిపించినా.. క్రమక్రమంగా బీజేపీకి అనుకూల ఫలితాలు వెలువడుతున్నాయి.

ఈ క్రమంలో హరియాణాలో మూడోసారి బీజేపీ అధికారం చేపట్టే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న ట్రెండ్స్ ని పరిశీలిస్తే... బీజేపీ 48 స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ 36, ఇతరులు 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఈ సమయంలో తీవ్ర ఉత్కంఠ మధ్య రెజ్లర్ వినేష్ ఫోగట్ ఘనవిజయం సాధించారు.

అవును... హరియాణా ఎన్నికల ఫలితాలు రసవత్తరంగా మారుతున్నాయి. చాలా చోట్ల బీజేపీ – కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ సాగుతోంది. రౌండ్ రౌండ్ కీ తీవ్ర ఉత్కంఠ నెలకొంటున్న పరిస్థితి. ఈ సమయంలో జులానా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వినేష్ ఫోగట్ గెలుపొందారు.

వాస్తవానికి కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచీ లీడ్ లో కొనసాగిన రెజ్లర్ నివేష్... మధ్యలో కాస్త వెనుకంజలో పడ్డారు. అయితే... ఫైనల్ గా పుంజుకుని ఐదువేలకు పైగా ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి యోగేష్ కుమార్ పై గెలుపొందారు. ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అభ్యర్థి సురేందర్ మూడో స్థానంలో నిలిచారు.