పళ్ల రసమే పాపమై.. వినేష్‌కు శాపమై!!
పళ్ల రసం! సాధారణంగా అలిసిపోయినప్పుడు ప్రతి ఒక్కరూ వెంటనే పుంజుకునేందుకు.. పళ్ల రసాన్ని తీసుకుంటారు
By: Tupaki Desk | 15 Aug 2024 4:42 PM GMTపళ్ల రసం! సాధారణంగా అలిసిపోయినప్పుడు ప్రతి ఒక్కరూ వెంటనే పుంజుకునేందుకు.. పళ్ల రసాన్ని తీసుకుంటారు. వెంటనే కోలుకుంటారు కూడా! సాధారణ ప్రజల్లో ఇది మంచి చేసినా.. కీలక క్రీడాకారుల విషయంలో పళ్ల రసం కూడా ఒక్కొక్క సారి శాపంగా మారుతుంది. ఇప్పుడు ప్రముఖ రెజ్లర్ వినేష్ ఫొగాట్ విషయంలో పళ్ల రసమే పాపమైంది. ఒలింపిక్స్‌కు దూరమయ్యే శాపంగా మారిపోయింది. తాజాగా ప్యారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో మూడు దశలను సునాయాసంగా ఛేదించి.. స్వర్ణమో.. రజత పతకమో ఖాయమనే స్థాయికి చేరుకుంది.. వినేష్ ఫొగట్.
అయితే.. తెల్లవారితో తుది రౌండ్‌లో అమెరికా రెజ్లర్‌తో పోటీ పడాల్సిన తరుణంలో ఆమె తీసుకున్న ఆహారమే ఆమెకు శాపంగా మారిపోయింది. వరుసగా మూడు దశల్లో పోరాడిన వినేష్ విజయం దక్కించుకుంది. ఈ క్రమంలో కొంత అలసటకు గురైంది. దీంతో ఆమె.. అలసట నుంచి బయట పడేందుకు.. జ్యూస్ , ఫ్యూయిడ్స్, స్వల్పంగా స్నాక్స్ తీసుకుంది. దీంతో ఒక్కసారిగా ఆమె 3 కిలోల బరువు పెరిగిపోయింది. కానీ, 50 కేజీల రెజ్లింగ్‌లో అంతకు మించి బరువు ఉండకూడదు.
దీంతో హుటా హుటిన.. ఆమె అనేక ఎక్సర్‌సైజలు చేసింది. రాత్రంతా మేల్కొనే ఉంది.. ట్రెడ్డింగ్ మిల్‌పై సవారీ చేసింది. జుత్తు కత్తరించుకుంది. వేసుకున్న దుస్తులకు ఉన్న ఎలాస్టిక్‌ను కూడా తొలగించుకుం ది. అయినా.. బరువులో 100 గ్రాములు మిగిలే ఉంది. దీనికి ప్రధాన కారణం.. జ్యూసేనని తెలిసింది. ఎన్ని వ్యాయామాలు చేసినా.. బరువును తగ్గించుకోలేక పోయింది.
నిర్ణీత సమయానికి 50 కిలోల 99.2 గ్రాములు ఎక్కువగా ఉంది. దీంతో ఒలింపిక్ నుంచి ఆమె నిషేధం ఎదుర్కొంది. దీనిని రివ్యూచేయాలనికాస్ కు పెట్టుకున్న అభ్యర్థన కూడా వీగిపోయింది. ఫలితంగా స్వర్ణమో, రజతమో దక్కించుకోవాల్సిన వినేష్.. చివరకు ఎలాంటి పతకం లేకుండానే భారత్కు తిరుగు ముఖం పట్టారు.
ఇవీ.. శాపంగా మారిన పదార్థాలు
+ జ్యూస్ - 300 గ్రాములు.
+ ఫ్ల్యూయిడ్స్ - 2 కిలోలు
+ స్నాక్స్ - 700 గ్రాములు.