మణిపూర్ హింసలో 67 వేల మంది నిరాశ్రయులయ్యారా?
దీంతో మణిపూర్ విషయంలో కేంద్రం తీసుకున్న చర్యల వల్ల అల్లర్లు సద్దుమణిగాయి.
By: Tupaki Desk | 15 May 2024 9:32 AM GMTఈశాన్య రాష్ట్రాల్లో హింస ఈనాటిది కాదు. ఇందులో మణిపూర్ రాష్ట్రం మరింత సున్నితమైంది. గత ఏడాది ఇక్కడ జరిగిన హింసలో 67 వేల మంది నిరాశ్రయులైనట్లు ఇంటర్నల్ డిస్ ప్లేవ్ మెంట్ మానిటరింగ్ సెంటర్ తెలిపింది. మణిపూర్ హింస ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రశ్నలకు తావిచ్చింది. దీంతో మణిపూర్ విషయంలో కేంద్రం తీసుకున్న చర్యల వల్ల అల్లర్లు సద్దుమణిగాయి.
2018 తరువాత అల్లర్ల కారణంగా దేశంలో ఇంతమంది నిరాశ్రయులు కావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. నిరాశ్రయుల్లో కొందరు నాగాలాండ్, అస్సాం, మిజోరాం రాష్ట్రాలకు వలస వెళ్లినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా వరదలు, భూకంపాలు వంటి విపత్తులతో మరో 5.28 లక్షల మంది నిరాశ్రయులు అయినట్లు తెలియజేసింది. ఇలా మణిపూర్ అంశం ఎప్పుడు వివాదాస్పదంగానే మారుతుంది.
ఈశాన్య రాష్ట్రాల్లో హింస చెలరేగడానికి అల్లర్లే కారణం. అల్లర్లు జరగడానికి దారి తీసే పరిస్థితుల వల్ల ఆ రాష్ట్రం రావణకాష్టంలా రగులుతూనే ఉంటుంది. ఇక్కడ వరదలు, భూకంపాలు కూడా ఎక్కువే. దీంతో చాలా మంది బాధితులుగా మారడంలో అతిశయోక్తి లేదు. అందుకే ఈశాన్య రాష్ట్రాలు అల్లర్లకు మారుపేరుగా నిలుస్తున్నాయి.
మణిపూర్ అంటేనే అల్లర్లకు కేరాఫ్ అడ్రస్. దేశంలో హింస చెలరేగడానికి కారణమయ్యే పరిస్థితులు కూడా అక్కడ నెలకొంటున్నాయి. దీని వల్ల చాలా మంది నిరాశ్రయులవుతున్నారు. బతుకు పోరాటంలో అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. తమ దుస్థితికి బాధపడుతున్నారు. చేయని తప్పులకు శిక్ష అనుభవిస్తున్నారు.
ఈశాన్య రాష్ట్రాల్లోనే ఎందుకు అల్లర్లు జరుగుతాయి? అక్కడ జరిగే సంఘటనలేంటి? ఎందుకు వారిలో రాక్షసత్వం పెరుగుతోంది? మనుషుల ప్రాణాలు తీసేందుకు కూడా వెనకాడటం లేదు. దీంతో చాలా మంది సమిధలవుతున్నారు. చేయని నేరానికి బలవుతున్నారు. తమ బతుకులు ఇక మారవా అనే ధోరణిలోనే కాలం వెల్లదీస్తున్నారు.