Begin typing your search above and press return to search.

వైరల్ వీడియో... యూఎస్ ఎన్నికల ఫలితాలపై 'హిప్పోపొటామస్' జోస్యం!

ఈ సమయంలో థాయిలాండ్ జూ లోని ఓ హిప్పోపొటామస్ జోస్యం వైరల్ గా మారింది.

By:  Tupaki Desk   |   5 Nov 2024 5:42 PM GMT
వైరల్  వీడియో... యూఎస్  ఎన్నికల ఫలితాలపై హిప్పోపొటామస్ జోస్యం!
X

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలే హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఒకరికి పాజిటివ్ గా వస్తే.. బెట్టింగ్ యాప్ ల ఫలితాలు మరొకరికి సానుకూలంగా తెరపైకి వచ్చాయి. ప్రధానంగా స్వింగ్ స్టేట్స్ లో ఫైట్ 50 - 50 అని అంటున్నారు. ఈ సమయంలో థాయిలాండ్ జూ లోని ఓ హిప్పోపొటామస్ జోస్యం వైరల్ గా మారింది.

అవును... ఎన్నికల సీజన్ స్టార్ట్ అయ్యిందంటే.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు, జోతిష్యాలు, బెట్టింగుల బ్యాచ్ అంచనాల సందడి గురించి చెప్పే పనేలేదు! పొరపాటున అందులో ఎవరి అంచనా అయినా సక్సెస్ అయితే... రాత్రికి రాత్రి వారు కూడా సెలబ్రెటీల జాబితాలో చేరిపోతారు. ఈ సమయంలో అమెరికా ఎన్నికల ఫలితాలపై ఓ జూలో హిప్పోపొటామస్ జోస్యం తెరపైకి వచ్చింది.

ఇందులో భాగంగా... థాయిలాండ్ కు చెందిన మూ డెంగ్ అనే బేబీ పిగ్మీ హిపోపొటామస్ యూఎస్ ఎన్నికల 2024కి ముందు జ్యోతిష్కుడి పాత్రను పోషించింది. ఈ సందర్భంగా.. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో... రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ లలో ఎవరు గెలుస్తారనే విషయంపై తనదైన శైలిలో వెరైటీ జోస్యం చెప్పింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

థాయిలాండ్ లోని సిరాచా లోని ఖావో ఖీవ్ ఓపెన్ జూలో ఓ వీడియో రికార్డ్ అయ్యింది. ఇందులో ఓ హిప్పోపొటామస్ కు పుచ్చకాయ షెల్ లను ఉపయోగించి తయారుచేసిన పండ్ల బుట్టలను ఏర్పాటు చేశారు. ఇందులో ఒక బుట్టపై డొనాల్డ్ ట్రంప్ అని, మరో బుట్టపై కమలా హారిస్ అని పేర్లు రాసిపెట్టారు. ఈ సమయంలో ఎంట్రీ ఇచ్చిన హిప్పో... నేరుగా ట్రంప్ పేరు రాసిన బుట్టవద్దకు వెళ్లి, తినడం ప్రారంభించింది.

దీంతో... ఈ మూ డెంగ్ అంచనాలు దాదాపు అన్ని బెట్టింగ్ యాప్ లకు మద్దతు ఇస్తుందని అంటున్నారు. మరోపక్క ప్రస్తుతం తెరపైకి వస్తోన్న అంచనాల ప్రకారం... అత్యంత కీలకమైన స్వింగ్ స్టేట్స్ లో ట్రంప్ దూకుడు ప్రదర్శిస్తున్నారని.. కమలా హారిస్ కంటే 1.8% ఆధిక్యాన్ని కలిగి ఉన్నారనే చర్చా తెరపైకి వచ్చింది.