Begin typing your search above and press return to search.

విరాట్‌-అనుష్క లండ‌న్‌కి షిఫ్టింగ్

కోహ్లీ తన భార్య అనుష్క శర్మ, వారి పిల్లలతో కలిసి లండన్ లో స్థిర‌ప‌డాలని భావిస్తున్నట్లు శర్మ వెల్లడించారు.

By:  Tupaki Desk   |   19 Dec 2024 10:30 PM GMT
విరాట్‌-అనుష్క లండ‌న్‌కి షిఫ్టింగ్
X

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి- అనుష్క శ‌ర్మ జంట లండ‌న్‌లో స్థిర‌ప‌డ‌తార‌ని చాలా కాలంగా ప్ర‌చారం ఉంది. ఈ జంట‌ చాలా కాలంగా లండన్ కు వెళుతూ.. తిరిగి ఇండియాలో అసైన్‌మెంట్స్ కోసం వ‌స్తున్నారు. వారు త‌మ పిల్ల‌లు లండ‌న్‌లో పెర‌గాల‌ని కోరుకుంటున్నారు. కోహ్లి-అనుష్క జంట అక్కడ ఓ విలాస‌వంత‌మైన ఇల్లు కొనుక్కున్నారు. కోహ్లీ క్రికెట్ కి గుడ్ బాయ్ చెప్పేశాక లండన్ కి షిఫ్ట్ అవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ ఒక ఇంటర్వ్యూలో దీనిని ధృవీక‌రించారు. కోహ్లీ తన భార్య అనుష్క శర్మ, వారి పిల్లలతో కలిసి లండన్ లో స్థిర‌ప‌డాలని భావిస్తున్నట్లు శర్మ వెల్లడించారు. కోహ్లి త్వరలో లండ‌న్‌కి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందని, అయితే 2027 ప్రపంచకప్ వరకు అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడతాడని తెలిపారు. ''కోహ్లీ ప్రస్తుతం పీక్ ఫామ్‌లో ఉన్నాడు.. ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉంది'' అని శర్మ అన్నాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టెస్టులో కోహ్లీ సెంచరీ సాధించిన సంగ‌తి తెలిసిందే. మిగిలిన మ్యాచ్‌లలో అతను మరో రెండు సెంచరీలను జోడిస్తాడని నమ్ముతున్న‌ట్టు శ‌ర్మ తెలిపారు. కోహ్లీ ఇంకా ఫిట్‌గా ఉన్నాడని .. రిటైర్‌మెంట్‌కు స‌మ‌యం ఉంద‌ని.. క్రికెటర్‌లో ఇంకా చాలా చేయాల్సి ఉంద‌ని వ్యాఖ్యానించారు.

విరాట్ కోహ్లీ- అనుష్క శ‌ర్మ జంట ఇస్కాన్ భ‌క్తులు అన్న సంగ‌తి తెలిసిందే. లార్డ్ శ్రీ‌కృష్ణ కీర్త‌న్‌లో పాల్గొనేందుకు లండ‌న్ లోని ఇస్కాన్ శ్రీ‌కృష్ణ ఆల‌యాన్ని నిరంత‌రం సంద‌ర్శిస్తున్నారు. వారు త‌మ పిల్ల‌లు స‌త్సాంప్ర‌దాయంలో పెర‌గాల‌ని కోరుకుంటున్నారు. దైవ‌స‌న్నిధానంలో ధ్యానం, ఆహ్లాదాన్ని కోరుకుంటున్నారు. త‌దుప‌రి విరామ జీవితాన్ని అర్థవంతంగా తీర్చిదిద్దుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. విలువ‌లు సాంప్ర‌దాయాల‌కు వారు పెద్ద పీట వేస్తున్నారు. అభిమానుల తాకిడికి దూరంగా ప్రైవ‌సీని కూడా వారు కోరుకుంటున్నారు.